గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన వారికి అభవృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతీ ఒక్కరికి అందించి నూతన వరవడికి శ్రీకారం చుట్టాముచాగల్లు (ప్రజా అమరావతి);రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన వారికి  అభవృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతీ ఒక్కరికి అందించి నూతన వరవడికి శ్రీకారం చుట్టాము


..

 రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. తానేటి వనిత.


రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అభివృద్ధి సంక్షేమమ ఫలాలు ప్రతీ ఒక్కరికి అందించే నూతన వరవడికి శ్రీకారం చుట్టా మని రాష్ట్ర స్త్రీ శిశు సం క్షేమ శాఖ మంత్రి డా. తానేటి వనిత.అన్నారు.


 చాగల్లు మండలంలో ఆదివారం మంత్రి తానేటి వనిత  కోటి రూపాయలు విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకి, వైద్యానికి అధిక ప్రాధాన్యత  ఇచ్చి పేద ప్రజలను ఆదుకోవడం జరుగుతోందన్నారు. ప్రజ ల్లకు మెరుగైన సేవలు అందించేందుకు నెలటూరు గ్రామం లో 40 లక్షల రూపాయలతో గ్రామ సచివాలయం భవనాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు ప్రారంభించామన్నారు. పర్యటన సందర్భంగా కలవలపల్లి గ్రామంలో 40 లక్షల రూపాయ లతో గ్రామ సచివాలయం భవ నాన్ని, 20 లక్షల రూపాయల తో రైతు భరోసా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో రైతులకు అన్ని రకాల పంటలు గురించి రైతులకు కలిగే ఎటువంటి సందేహం ఉన్నా సలహాలను ఇచ్చేందుకు, రైతులు  తెలుసు కోవడానికి  రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరి గిందన్నారు.  అభివృద్ధి,సంక్షేమ ఫలాలను గ్రామంలోని ప్రతి కుటుంబానికి చేరువ చేసే విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. రైతులకు ఎరువులు పురుగు మందులు, విత్త నాలు అందుబాటు లో ఉంచి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వారికి చేరువ చేసే విధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు.  భూసార పరీక్ష లు నిర్వహించి భూసారానికి అనుగుణంగా పంటలు వేయ డం ద్వారా వ్యవసాయాన్ని రైతులకు  లాభసా టి చేసేలా ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నామన్నారు.  గ్రామాల్లో అన్ని రోగాలకు చికిత్స అందించి మెరుగైన వైద్యాన్ని అందించే విధంగా విలేజ్ క్లినిక్లను నిర్మిస్తున్నామన్నారు.  వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసామని గ్రామాల్లో అర్హులైన వారందరికీ  సంక్షేమ ఫలాలను నేరుగా అందించేందుకు ప్రత్యేక సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు.


మంత్రి తానేటి వనిత కు గ్రామ సచివాలయ సిబ్బంది వినతి పత్రం అందచేత : 

చాగల్లు మండలంలో నేలటూరు గ్రామ సచివాలయం లో మంత్రి వనితకు గ్రామ సచివాలయం ఉద్యోగులకు వీలైనంత త్వరగా ప్రొబేషన్ డిక్లేర్  చేయగలరని వినతిపత్రం సమర్పించారు


ఈ కార్యక్రమంలో ఏ. యం. సి. ఛైర్మెన్, వల్లభశెట్టి గంగా ధర శ్రీనివాసరావు, చాగల్లు జెడ్పిటిసి గారపాటి విజయదుర్గ, ఎంపిపి మాట్టా వీరాస్వామి, ఎంపీడీఓ బి. రాంప్రసాద్, తాహసీల్దార్ ఎమ్. శ్రీనివాస రావు, కె. అశోక్ బాబా, ఆత్మ ఛైర్మెన్, గండ్రోతు సురేంద్ర రెడ్డి, యం. పి. టి. సి. తాళ్ళురి రమ్య, సర్పంచ్ లు, ఆకుల లక్ష్మి, వై.ఉమా రజని, ప్రత్తిపాటి రామచంద్ర రావు, కె. సూర్య నా రాయణ, స్థానిక ప్రజాప్రతి నిధు లు, అధికారులు,  తదితరులు పాల్గొన్నారు.