జిల్లాలో గడువు దాటిన స్పందన అర్జీలు ఇంకా చాలా శాఖల్లో పరిష్కారం కాకుండా ఉన్నాయన్నారు



నెల్లూరు జనవరి 3 (ప్రజా అమరావతి):-- ప్రజల నుండి అందే స్పందన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీ  కె వి ఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.  సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్  " స్పందన కార్యక్రమం " నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.  


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ

జిల్లాలో  గడువు దాటిన స్పందన అర్జీలు ఇంకా చాలా శాఖల్లో పరిష్కారం కాకుండా ఉన్నాయన్నారు


.  ప్రధానంగా పురపాలక, రెవిన్యూ, రిజిస్ట్రేషన్ స్టాంపులు, పోలీసు, మెప్మా, పౌరసరఫరాలు, విద్య, గనులు, డిఆర్డిఎ, ఎక్సైజ్, మార్కెటింగ్ ఖజానా శాఖలలో  ఎక్కువగా అర్జీలు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. వాటన్నిటిని వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు.  ఈనెల ఐదో తేదీ బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు  స్పందన కార్యక్రమంపై  సమీక్షించనున్నారన్నారు. ప్రధానమైన అంశాలపైన మరింత పురోగతి సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిబింబించే విధంగా అధికారులు అందరూ కృషి చేయాలని ఆదేశించారు. అలాగే సచివాలయం పరిధిలో కూడా బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు,  పింఛన్లు, ఇళ్ల పట్టాలకు  సంబంధించిన అర్జీలను అత్యంత ప్రాధాన్యత అంశాలుగా పరిగణించి వెంటనే పరిష్కరించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో అత్యధికంగా విద్యుత్ శాఖకు సంబంధించి 1600 దరఖాస్తులు ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. అలాగే పౌరసరఫరాల శాఖ పరిధిలో 220, డిఆర్డిఎ పరిధిలో పింఛన్లకు సంబంధించి 200 అర్జీలు అపరిష్కృతంగా ఉన్నాయని వాటిని సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  గ్రామ,  వార్డు సచివాలయాలతో సహా ప్రధానంగా ఐదారు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అర్జీలు మరల రాకుండా నాణ్యతగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రత్యేక అధికారులు మండలాల్లో విస్తృతంగా పర్యటించి వన్టైమ్ సెటిల్మెంట్, గృహ నిర్మాణం పనులు ముమ్మరంగా జరిగేలా చొరవ చూపాలన్నారు.  భారీ వర్షాలు, వరదల కారణంగా  దెబ్బతిన్న రహదారులు,వంతెనల నిర్మాణం పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని, వాటికి సంబంధించిన వారాంతపు నివేదికను అందజేయాలని కలెక్టర్ సూచించారు.

అనంతరం

మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా చైర్మన్ శ్రీ చౌహాన్ లక్ష్మణ్ సింగ్ వారి సంస్థ  నూతన సంవత్సర క్యాలెండర్ను తీసుకురాగా జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.


ఈ కార్యక్రమంలో రెవెన్యూ సంయుక్త కలెక్టర్ శ్రీ హరెందిర ప్రసాద్, అభివృద్ధి సంయుక్త కలెక్టర్ శ్రీ గణేష్ కుమార్, గృహనిర్మాణం సంయుక్త కలెక్టర్ శ్రీ విదెహ్ ఖరే, డిఆర్ఓ శ్రీ చిన్న ఓబులేసు, జడ్పీ సీఈఓ శ్రీ శ్రీనివాస రావు,కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీ కే దాసు, నుడా విసి శ్రీ రమేష్, డిఎస్ఓ శ్రీ వెంకటేశ్వర్లు, డీఈఓ రమేష్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, జలవనరుల శాఖ  ఎస్ ఈ లు  శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీ శ్రీనివాస కుమార్, శ్రీ కృష్ణ మోహన్, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీ బ్రహ్మానందరెడ్డి, బీసీ సంక్షేమ అధికారి శ్రీ వెంకటయ్య,  ఐ.టి.డి.ఎ.  పి ఓ  శ్రీమతి భవాని తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.  

Comments