హిందూపురం, గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్ టెస్టింగ్ ల్యాబుల ఏర్పాటు

 హిందూపురం, గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్ టెస్టింగ్ ల్యాబుల ఏర్పాటు* 


*: జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి*


 హిందూపురం, జనవరి 12 (ప్రజా అమరావతి);


*కరోనా నేపథ్యంలో త్వరలో హిందూపురం, గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా కోవిడ్ టెస్టింగ్ ల్యాబులను ప్రారంభించనున్నామని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి కోవిడ్ సన్నద్ధత చర్యల పర్వవేక్షణలో భాగంగా జాయింట్ కలెక్టర్ ఏ.సిరి, పెనుకొండ సబ్ కలెక్టర్ మల్లారపు నవీన్ లతో కలిసి హిందూపురం జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడారు.*


*ఈ సందర్భంగా జిల్లాలో ఆర్టీపిసిఆర్ టెస్టులు చేపట్టడం అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మాత్రమే జరిగేవని, ప్రస్తుతం హిందూపురం జిల్లా ఆస్పత్రిలో, గుంతకల్లు ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీని ద్వారా అదనంగా 4, 5 వేల శాంపిల్స్ లకు టెస్టింగ్ చేసే అవకాశం ఏర్పడిందని, నూతన ల్యాబుల ఏర్పాటు ద్వారా జిల్లాలో రోజుకు 10,000 కోవిడ్ టెస్టు ఫలితాలు అందించే అవకాశం ఉంటుందన్నారు. టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటుకు కావాల్సిన సామగ్రి హిందూపురం జిల్లా ఆసుపత్రికి చేరుకుందని, సిబ్బందిని నియమించి ఈ నెల 18వ తేదీ నుంచి ల్యాబు ద్వారా ఫలితాలు వెల్లడించనున్నామన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హిందూపురం పరిధిలోని ప్రజలంతా హిందూపురం జిల్లా రెండో దశ  ఈ దశ లో  ఆస్పత్రికి వచ్చే అవకాశముందని, కోవిడ్ వార్డు, ట్రేయేజింగ్ ఎక్కడ ఏర్పాటు చేస్తారు అనే పలు అంశాలపై పరిశీలన కోసం ఇక్కడకు రావడం జరిగిందన్నారు. గత ఏడాది నుంచి ఇప్పటికి అదనంగా ఆక్సిజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఎల్ఎంఓ ట్యాంక్ లు, ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కరోనా రెండో దశకు ఈ దశకు మధ్య జిల్లాలో ఆక్సిజన్ బెడ్లు, ఐ సియు బెడ్లు 40 శాతం పైగా అదనంగా ఏర్పాటు చేశామని, ప్రభుత్వాసుపత్రులతోపాటు 100 పడకలకు పైనవున్న ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా పిఎస్ఏ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం, 50 నుంచి 100 పడకలకుపైన ఉన్న వాటిలో అదనంగా ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు కొనుగోలు చేశామన్నారు. జిల్లాలో 2,700 డి టైప్ సిలిండర్లు అదనంగా తెచ్చుకోవడం జరిగిందన్నారు. ఎక్కడా ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు.*