నెల్లూరు, జనవరి 4 (ప్రజా అమరావతి): జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగంగా నగదు చెల్లించిన లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను త్వరగా పూర్తి
చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.
మంగళవారం ఉదయం నెల్లూరు రూరల్ మండల పరిధిలోని చంద్రబాబు నగర్ 31/2, వైయస్సార్ నగర్ శంకరన్ కాలనీ 31/1, ప్రహతి నగర్ 31/3 సచివాలయాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 10వ తేదీ లోపు ఒక మెగా డ్రైవ్ ను ఏర్పాటు చేసి ఓ టి ఎస్ పథకం కింద నగదు చెల్లించిన లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని, ఇంకా మిగిలి ఉన్న లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఈ పథకం ప్రయోజనాలను వారు పొందేలా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే రెండు డోసుల కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకున్న వారు మరింత సురక్షితంగా ఉండేందుకు వారికి త్వరలోనే మూడోడోసు కూడా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, దీనిపై ప్రజలకు ముందుగానే అవగాహన కల్పించాలని సూచించారు. పింఛన్ల పంపిణీ, జగనన్న ఇళ్ల నిర్మాణ పనుల పురోగతి, రోజువారి అర్జీలు తదితర అంశాలపై సచివాలయ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ వెంట నెల్లూరు రూరల్ తాసిల్దార్ శ్రీ షఫీ మాలిక్, కార్పొరేషన్ సూపరింటెండెంట్ శ్రీ నాగేశ్వరరావు, సచివాలయ అడ్మిన్లు శ్రీ దీపిక, శ్రీ సునీత, శ్రీ మహేంద్ర రెడ్డి, ఇతర సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
addComments
Post a Comment