విద్యార్థులందరూ క్రీడల్లో బాగా రాణించి జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి.


నెల్లూరు, జనవరి 4 (ప్రజా అమరావతి): విద్యార్థులందరూ క్రీడల్లో బాగా రాణించి జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని


జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు పిలుపునిచ్చారు. 


 మంగళవారం ఉదయం స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఆజాదికా అమృత్ మహోత్సవాల్లో భాగంగా నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను కలెక్టర్ ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  యువత క్రీడాస్ఫూర్తిని పెంచుకొని  రాష్ట్ర స్థాయికి, జాతీయ స్థాయికి  ఎదగాలని పిలుపునిచ్చారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, గెలిచిన వారు పొంగిపోకుండా, ఓడినవారు కుంగిపోకుండా క్రీడాస్ఫూర్తిని  ప్రదర్శించి జీవితంలో అనుకున్న లక్ష్యం వైపు పయనించి ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి  నెహ్రూ యువ కేంద్ర  జిల్లా యువజన అధికారి  శ్రీ మహేంద్ర  రెడ్డి మాట్లాడుతూ  యువత ఆరోగ్యంపై  శ్రద్ధ వహించి  క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో  సెట్నల్ సీఈవో  శ్రీ పుల్లయ్య, ఎన్ సి సి నావల్ కెప్టెన్ శ్రీ విజయ్ చంద్రన్,  చీఫ్ కోచ్ శ్రీ యతిరాజులు, పలువురు క్రీడాకారులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. 

Comments