ఎంఎస్ఎంఈల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి..


విజయవాడ (ప్రజా అమరావతి);ఎంఎస్ఎంఈల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.. 


26 లక్షల ఎంఎస్ఎంఈల ద్వారా 70 లక్షల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.. 

100 ఎకరాల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు..

వివరాలను వెల్లండించిన ఎంఎస్ఎంఈ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ వంకా రవీంద్రనాథ్


        రాష్ట్రంలో లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) బలోపేతం చేయడం ద్వారా  పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్ మెంట్ కార్పోరేషన్ పనిచేస్తుందని ఆ సంస్థ చైర్మన్ వంకా రవీంద్రనాథ్ తెలిపారు. విజయవాడ ముత్యాలంపాడులోని గవర్నమెంట్ ప్రెస్ ఆవరణలో ఉన్న ఎంఎస్ఎంఈ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఉదయం చైర్మన్ అధ్యక్షతన బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో 26 లక్షల ఎంఎస్ఎంఈ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఉన్నారని, వీరిద్వారా 70 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించబడుతున్నాయని ఆయన అన్నారు. ఎంఎస్ఎంఈ స్థాపనలో దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5వ స్ధానంలో నిలిచిందన్నారు.

రాష్ట్రంలో ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ పాలసీ లక్ష్యం మేరకు 2023 నాటికి రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోను దాదాపు 100 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయనున్నామని, దీని ద్వారా స్థానిక అవసరాలు తీర్చే విధంగా ఉత్పత్తులు సాధించుటకు చర్యలు చేపట్టామన్నారు. ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ పాలసీ ప్రకారం రాష్ట్రంలో మూతపడిన ఎంఎస్ఎంఈ యూనిట్లన్నింటినీ తిరిగి ఉత్పత్తి ప్రారంభించే విధంగా ప్రభుత్వం సీడ్ కేపిటల్ ను అందించనుందని ఆయన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను కల్పింస్తుందన్నారు. ఎంఎస్ఎంఈ-ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రొత్సహించేందుకు తద్వారా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం అనేక రాయితీలను కల్పించిందన్నారు. దీనిలో భాగంగా ఎంఎస్ఎంఈ యూనిట్లను ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలకు స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ ఫర్ డ్యూటీ ఆన్ ల్యాండ్ నూరుశాతం రీఎంబర్స్ మెంట్ కల్పించామని, విద్యుత్ వాడకంపై యూనిట్ కు ఒక రూపాయి చొప్పున రీఎంబర్స్ మెంట్ కల్పిస్తున్నాం, ఎంఎస్ఎంఈ పరిశ్రమ స్థాపన పెట్టుబడిలో 20 లక్షల లోపు వరకూ 15 శాతం సబ్సిడీ కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. జిల్లాల వారీగా ఎంఎస్ఎంఈలను యూనిట్లను క్లస్టర్లుగా గుర్తించి వాటికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించి వారి ఉత్పత్తులను అంతర్జాతీయంగా ఎక్స్ పోర్ట్ చేసేవిధంగా అవసరమైన ప్రొత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఉన్న విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవడం, ప్రాంతాల మధ్య సమతుల్యం, అంతర్జాతీయంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా అందుబాటులో ఉన్న నైపుణ్యాల వృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ వంటి విధానాలతో ఎంఎస్ఎంఈల బలోపేతానికి ప్రభుత్వం కృషిచేస్తుందని రవీంద్రనాథ్ తెలిపారు. 

ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్ మెంట్ కార్పోరేషన్ సమావేశంలో బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఎన్. రఘునాథ్ రెడ్డి, ఎస్. ఆనంద పార్థసారథి, నల్ల బేబీ జానకి, భీమవరపు విజయలక్ష్మి, తలారి అంజనీయ్, గోపర్తి వరలక్ష్మి, కస్గిరెడ్డి శారద, షేక్ కరిముల్లా, మేడా వెంకట బద్రినారాయణ, శీలమే నదియా, ముదడ్ల గౌరీ శంకర్ రావు, సీఈవో ఆర్. పవనమూర్తి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోపాల కృష్ణ పాల్గొన్నారు.