జాతీయస్థాయి పోటీల ద్వారా తెలుగు జాతి సాంప్రదాయాలను గుర్తుచేయడం అభినందనీయం- జాతీయస్థాయి పోటీల ద్వారా తెలుగు జాతి సాంప్రదాయాలను గుర్తుచేయడం అభినందనీయం - రెండవ రోజు నాలుగు పళ్ళ విభాగంలో పోటీలు ప్రారంభించిన కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు గుడివాడ, జనవరి 12 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడలో జాతీయస్థాయిలో ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన పోటీలను నిర్వహించడం ద్వారా రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), ఆయన సోదరుడు కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) లు తెలుగుజాతి సాంప్రదాయాలను గుర్తు చేయడం అభినందనీయమని కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. బుధవారం లింగవరం రోడ్డులోని కే. కన్వెన్షన్ లో ఎన్టీఆర్ టూ వైఎస్సార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండవ రోజు జరుగుతున్న నాలుగు పళ్ళ విభాగం పోటీలను ఆయన పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఒంగోలు జాతి పశు పోషకులు, రైతులనుద్ధేశించి మాట్లాడారు. గత ఐదేళ్ళుగా కొడాలి నాని, కొడాలి చిన్నిలు జాతీయస్థాయిలో పోటీలను నిర్వహించడం జరుగుతోందన్నారు. సంక్రాంతి సంబరాలంటే మొదటగా ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు ప్రదర్శన పోటీలే గుర్తుకు వస్తాయన్నారు. గుడివాడలో నిర్వహించే జాతీయస్థాయి పోటీలకు సుదూర ప్రాంతాల నుండి పశు పోషకులు తమ ఎడ్లను తీసుకువస్తున్నారని చెప్పారు. ఈ పోటీలను ప్రత్యక్షంగా చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుండి పెద్దఎత్తున పశు పోషకులు, రైతులు, ప్రజలు రావడం విశేషమన్నారు. తెలుగు జాతి సాంప్రదాయాల్లో ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు, కోడి పందాలు, వాలీబాల్, ముగ్గుల పోటీలు, క్రికెట్ పోటీలు భాగంగా ఉన్నాయన్నారు. యువత పేకాట, గుండాట వంటి అసాంఘిక కార్యక్రమాల వైపు వెళ్ళకుండా సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ద్వారా వారు ఎంతో ఉత్తేజంగా, సరదాగా కన్పిస్తారన్నారు. గుడివాడలో మంత్రి కొడాలి నాని, ఆయన సోదరుడు కొడాలి చిన్నిలు తర్వాతి తరాలకు కూడా గుర్తుండిపోయేలా తెలుగుజాతి గౌరవం, సాంప్రదాయాలను తెలియజేస్తున్నారని, ఇవి భవిష్యత్తులో పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. జాతీయస్థాయిలో జరుగుతున్న నాలుగు పళ్ళ విభాగం పోటీలను ప్రారంభించేందుకు తనను ఆహ్వానించిన మంత్రి కొడాలి నాని, కొడాలి చిన్నిలకు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పశు పోషకులకు మెమెంటోలను బహుకరించారు. ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు కూడా ట్రస్ట్ తరపున మెమెంటోను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైసచైర్మన్ అడపా బాబ్జి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీసు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, గుడివాడ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి, ఎంపీపీలు పెయ్యల ఆదాం, గద్దె పుష్పరాణి, జడ్పీటీసీ సభ్యుడు గోళ్ళ రామకృష్ణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నాయకులు పాలడుగు రాంప్రసాద్, గాదిరెడ్డి రామలింగారెడ్డి, మేకల సత్యనారాయణ, కొంకితల ఆంజనేయప్రసాద్, గిరిబాబాయ్, మూడెడ్ల ఉమా, దారం ఏడుకొండలు, చింతల భాస్కరరావు, వెంపటి సైమన్, దారం నరసింహా, కొలుసు నరేంద్ర, రేమల్లి పసి, ఆర్వీఎల్ నరసింహారావు, షేక్ సయ్యద్, యార్లగడ్డ సత్యభూషణ్, చుండి బాబి, పెద్ద కిషోర్, పొట్లూరి మురళీధర్, తోట రాజేష్, లోయ రాజేష్, ఎస్కే బాజీ, అలీబేగ్, చింతాడ నాగూర్, చిన్ని దుర్గాప్రసాద్, మాదాసు వెంకటలక్ష్మి, గంటా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.