క్రీడాకారుల అభిప్రాయాలు

 *క్రీడాకారుల అభిప్రాయాలు* 



 *క్రీడా నగరంగా తిరుపతికి గుర్తింపు:* 


 *-రంగనాథ్,ఎన్ ఐ ఎస్ కోచ్ చెన్న బసవ అకాడమి , బీదర్ జిల్లా, కర్నా టక రాష్ట్రం* 

గ్రామీణ క్రీడ అయిన కబడ్డీ ని ప్రోత్స హించి జాతీయ స్థాయిలో మహిళలు , పురుషులకు ప్రత్యేకంగా పోటీలు తిరుపతిలో శ్రి వెంకటేశ్వర స్వామి ముంగిట నిర్వహించడం సంతోషకరమని ఈ పోటీల నిర్వహణకు కృషి చేసిన తిరుపతి శాసన సభ్యులు , కమీషనర్ కు ఈ కార్యక్రమం విజయవంతం చేయడం లో బాగస్వాములు అయిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి అంటే  వెంకటేశ్వర స్వామి అని అంతర్జాతీయంగా పేరుగాంచిందని, నేడు జాతీయ క్రీడలు నిర్వహించడంతో  తిరుపతిపై అందరి దృష్టి మరలిందన్నారు. క్రీడాకారులు అందరూ  బాగా ఆడుతున్నారని, వారందరికి శుభాకాంక్షలు తెలిపారు. 



 *ఏర్పాట్లు భేష్ ...* 


 *మోహిత్ శర్మ ,  హర్యాన రాష్ట్రం :* 


జాతీయ ఆహ్వాన కబడ్డీ పోటీలకు హర్యానా రాష్ట్రం నుంచి ప్రాతినిద్యం వహిస్తున్నామని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మాలాంటి ఎంతో మంది క్రీడాకారులకు వసతి , లైజనింగ్, భోజన ఏర్పాట్లు భేషుగ్గా ఉన్నాయని ఇతర రాష్ట్రాలలో కూడా  ఇలాంటి పోటీలలో  మేము పాల్గొన్నామని, కాని అక్కడ ఏర్పాటు చేసిన వసతులతో పోలిస్తే తిరుపతిలో ఏర్పాట్లు చాలా బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.


 *ప్రతిభ కు పోటీలే ప్రధానం* 


 *సావిత్రి రఘు నాథ్, బీజాపూర్ జిల్లా , కర్నాటక రాష్ట్రం:* 


కర్నాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లా కాళిదాస్ పియుసి  (ఇంటర్మీడియట్) కాలేజి లో మొదటి సంవత్సరం చదువుతున్నానని, గ్రామీణ క్రీడ అయిన  కబడ్డీ కి జిల్లా రాష్ట్ర, అంతర్రాష్ట్ర పోటీలలో పాల్గొన్నానని 2020 విజయవాడలో జరిగిన పోటీలలో కూడా పాల్గొనడం జరిగింది. గత రెండు సంవత్సరాలుగా కరోనా తో  మ్యాచ్ లు లేక నిరాస పడ్డామన్నారు. ప్రస్తుతం తిరుపతిలో నిర్వహిస్తున్న జాతీయ కబడ్డీ ఆహ్వాన టోర్నమెంట్ తో ఆశలు చిగురించాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోటీలు అధికంగా ఆడటం వల్ల  వ్యక్తిగతంగా క్రీడా ప్రతిభను మెరుగు పరుచుకోవచ్చు న్నారు. 


Comments