ఒంగోలు జాతి విశిష్ఠతను నేటి తరానికి చాటి చెబుతున్న కొడాలి సోదరులు

 


- ఒంగోలు జాతి విశిష్ఠతను నేటి తరానికి చాటి చెబుతున్న కొడాలి సోదరులు 


- వ్యవసాయంలో ఎడ్ల వాడకాన్ని  మర్చిపోతున్నాం 

- రైతు జీవితంతో ఒంగోలు జాతికి అవినాభావ సంబంధం 

- గుడివాడలో జాతీయ పోటీలు నిర్వహించడం అభినందనీయం 

- రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) గుడివాడ, జనవరి 12 (ప్రజా అమరావతి): ఒంగోలు జాతి పశువుల విశిష్ఠతను రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), ఆయన సోదరుడు కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) లు నేటి తరానికి చాటి చెబుతున్నారని రాష్ట్ర రవాణా, సమాచార పౌరసంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) కొనియాడారు. గుడివాడ పట్టణం లింగవరం రోడ్డులోని కే. కన్వెన్షన్ లో ఎన్టీఆర్ టూ వైఎస్సార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన పోటీలను మంత్రి పేర్ని నాని వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నానికి కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) పుష్పగుచ్ఛాన్ని అందజేసి సత్కరించారు. అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన పోటీలను నిర్వహించడం సాంప్రదాయంగా కొనసాగుతోందని చెప్పారు. నేటికీ కొంత మంది పశు పోషకుల వల్ల ఇంకా ఈ జాతి పశువులు మనగల్గుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని, ఆయన సోదరుడు కొడాలి చిన్నిలు ఎన్టీఆర్ టూ వైఎస్సార్ ఛారిటబుల్ ట్రస్ట్ ను  ఏర్పాటు చేసి గత ఐదేళ్ళుగా గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నారన్నారు. వ్యవసాయంలో ఎడ్ల వాడకాన్ని మర్చిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాక్టర్లను పూర్తిస్థాయిలో వినియోగించడం వల్ల ఒకప్పుడు ఎడ్లను వాడేవారని నేటి తరం మర్చిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. వివిధ కారణాలతో గ్రామాలను వదిలి సుదూర ప్రాంతాల్లో స్థిరపడుతున్నామని చెప్పారు. సంక్రాంతి పండుగ సమయానికి స్వగ్రామాలకు చేరుకుంటారని, గుడివాడ ప్రాంత వాసులకు మాత్రం కొడాలి నాని, కొడాలి చిన్నిలు ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలను గత ఐదేళ్ళుగా చూపిస్తుండడాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైసైచైర్మన్ అడపా బాబ్జి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, గుడివాడ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి, ఎంపీపీలు పెయ్యల ఆదాం, గద్దె పుష్పరాణి, జడ్పీటీసీ సభ్యుడు గోళ్ళ రామకృష్ణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నాయకులు పాలడుగు రాంప్రసాద్, గాదిరెడ్డి రామలింగారెడ్డి, మేకల సత్యనారాయణ, కొంకితల ఆంజనేయప్రసాద్, గిరిబాబాయ్, మూడెడ్ల ఉమా, దారం ఏడుకొండలు, చింతల భాస్కరరావు, వెంపటి సైమన్, దారం నరసింహా, కొలుసు నరేంద్ర, రేమల్లి పసి, ఆర్విఎల్ నరసింహారావు, షేక్ సయ్యద్, యార్లగడ్డ సత్యభూషణ్, చుండి బాబి, పెద్ది కిషోర్, పొట్లూరి మురళీధర్, తోట రాజేష్, లోయ రాజేష్, ఎస్కే బాజీ, అలీబేగ్, చింతాడ నాగూర్, చిన్ని దుర్గాప్రసాద్, మాదాసు వెంకటలక్ష్మి, గంటా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.