గుంటూరు (ప్రజా అమరావతి); ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ 3వ వేవ్ ఉద్ధృతి దృష్ట్యా గుంటూరు నగరంలో వైరస్ బారిన పడిన ప్రజలకు GGH నందు మెరుగైన వైద్య సేవలు అందించుటకు హాస్పిటల్ నందు అవసరమైన మౌలిక సదుపాయాలు,బాధితులకు అవసరమైన బెడ్లు,ఆక్సిజన్ మరియు మందులు వంటి సదుపాయాలు ఉన్నది లేనిది GGH సూపరింటెండెంట్ N.ప్రభావతి గారిని వివరాలు అడిగి తెలుసుకొని, హాస్పటల్ పరిసరాలను పరిశీలిస్తున్న గుంటూరు_నగర_పాలక_సంస్థ_మేయర్_శ్రీ_కావటి_శివ_నాగ_మనోహర్_నాయుడు , MLC_శ్రీ_లేళ్ల_అప్పిరెడ్డి_.తదుపరి వారి ఇరువురూ మాట్లాడుతూ,
ప్రపంచవ్యాప్తంగా 3rd వేవ్ ఉధృతి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ లో గౌరవ సీ.ఎం గారి నేతృత్వంలో ఎక్కడ ఎవరు కూడా కరోనాతొ ఇబ్బందులు పడకూడదని,వీరి ఆరోగ్యానికి సంబంధించి,ప్రభుత్వమే బాధ్యత తీసుకొని,ప్రజలకు మెరుగైన సేవలు అందించుట
కు,అన్ని వ్యవస్థలను సమాయత్తం చేయడం జరిగిందన్నారు.
ప్రస్తుతం వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్నందున జిల్లా వ్యాప్తంగా 6,500 బెడ్ లను సిద్ధం చేశామని,పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా కూడా ఉచిత వైద్యం అందించుటకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
గుంటూరు నగరంలో ఉన్న GGH హాస్పిటల్ ఎంతో ప్రఖ్యాతిగాంచినదని,ఈ హాస్పిటల్ కు గుంటూరు నగరం నుండే కాక, చుట్టుప్రక్కల 4,5, జిల్లాల నుండి కూడా రోగులు వచ్చి వైద్యం చేయించుకుంటూ ఉంటారని,అటువంటి హాస్పిటల్ నందు మౌలిక సదుపాయాలు పరిశీలించడం జరిగింది అన్నారు.
గుంటూరు జిల్లాలో మరియు నగరం లో కరోనా వైరస్ వ్యాప్తి చాలా వేగంగా జరుగుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని గౌరవ సీ.ఎం గారి ఆదేశాల మేరకు,గుంటూరు నగరంలోని GGH నందు కరోనా వైరస్ సోకిన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించుటకు వైద్యారోగ్య శాఖ వారు అన్ని చర్యలు చేపట్టారన్నారు.
గుంటూరు నగరపాలక సంస్థ నుండి GGH పరిసరాలలో పారిశుద్ధ్యం మరియు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించుటకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు వనమా బాల వజ్ర బాబు గారు,షేక్ సజీల గారు,GDCC బ్యాంకు చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు గారు, YCP పార్టీ ముఖ్య నాయకులు,స్థానిక పెద్దలు,GGH సిబ్బంది
పాల్గొన్నారు.
addComments
Post a Comment