ఆరోగ్యకరమైన సమాజం నిర్మిద్దాం.
20 వ వార్డులో డస్ట్ బిన్ ల పంపిణీ
శాసనసభ్యులు అంబటి.
సత్తెనపల్లి (ప్రజా అమరావతి): ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం వ్యర్దాల నిర్వహణ తప్పనిసరని శాసనసభ్యులు అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం 20 వ వార్డు కౌన్సిలర్ కూకుట్ల లక్ష్మీ ఆధ్వర్యంలోజరిగిన డస్ట్ బిన్ ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ కార్యక్రమానికి మున్సిపల్ నాయకులు చల్లంచర్ల సాంబశివరావు అధ్యక్షత వహించారు.ఈ సందర్బంగా అంబటి మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ప్రతివార్డలోనూ వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు.చెత్తను వేరుచేయడంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలన్నారు. చెత్త నుండి సంపద తయారు చేసేందుకు వ్యర్థాలను వేరు చేయటం నిరంతర ప్రక్రియ అన్నారు. గృహావసరాల తర్వాత వచ్చే వ్యర్ధాలను పునర్వినియోగం ద్వారా సంపద, గ్యాస్, విద్యుత్ ..తయారు జరుగుతుందన్నారు. పొడి చెత్త నుంచి కూడా ఆదాయం సమకూరుతుందని ప్రజలు సహకరించాలని సూచించారు.
కమిషనర్ కొలిమి షమ్మీ మాట్లాడుతూ పారిశుద్ధ్యం, స్వచ్ఛత, వ్యర్థాల పునర్వినియోగం పై శాసన సభ్యులు వారి స్థాయిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ఏకైక నియోజకవర్గం మనదేనన్నారు. ప్రజలు భాగస్వామ్యం అయితేనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు. . దాతల సహకారంతో శాసన సభ్యులు వారి ఆలోచనల మేరకు వీటిని అందిస్తున్నామని వివరించారు.
అనంతరం వార్డు మహిళలకు రెండు రకాల డస్ట్ బిన్ లను పంపిణీ చేశారు.కార్యక్రమంలో వైస్ ఛైర్మన్లు షేక్ నాగూర్ మీరాన్, కోటేశ్వరరావు నాయక్, కౌన్సిలర్లు , కూకుట్ల శ్రీను ,నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటియర్లు, అన్ని వార్డుల ఇంచార్జీలు పాల్గొన్నారు.
addComments
Post a Comment