తణుకు (ప్రజా అమరావతి);
పశ్చిమగోదావరి జిల్లా స్థాయి సీఎం కప్ 2021 క్రీడా పోటీలను
ఈనెల 26 వతేదీ నుండి 28వ తేదీ వరకు తణుకు లో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసామని కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లిబాబు పేర్కొన్నారు.
శుక్రవారం తణుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఏర్పాట్లను ఆర్డీవో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలు మేరకు మూడు రోజుల పాటు జరిగే పోటీలను సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లను చెయ్యడం జరిగిందన్నారు. ఏపీ సీఎంకప్ పోటీలు శనివారం 26వ తేది తొలిరోజు కబడ్డీ , కోకో , వాలీబాల్, బాక్సింగ్ పోటీలు జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో, రెండవ రోజు ఆదివారం (27వ తేదీన ) అథ్లెటిక్స్ క్రీడాంశాలను ఆర్ట్స్ కాలేజీ లోనూ, ఫుట్ బాల్ , వెయిట్ లిఫ్టింగ్ పోటీలు జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ లోను , హ్యాండ్ బాల్ , లాన్ టెన్నిస్ పోటీలు ఎస్ కే డి ఎస్ ఉమెన్స్ కాలేజీ లో నిర్వహించే ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు. మహిళలకు, పురుషులకు వేరువేరుగా మూడు రోజులు జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నా మన్నారు. 28 సోమవారం ముగింపు వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ పోటీలలో జిల్లాలోని 15 నియోజకవర్గాల నుండి సుమారు రెండు వేల మందికి పైగా క్రీడాకారిణి లు, క్రీడాకారులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఆర్డీవో తెలిపారు. నిర్వహణకు సంబంధించి కోర్టులు, పిటీలు, పీడీ లు, డిజిటల్ డిస్ప్లే బోర్డు , తదితర ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. క్రీడా ప్రాంగణంలో తాత్కాలిక టాయిలెట్లు, మంచినీటి సదుపాయాలను, స్థానిక మునిసిపాలిటీ వారిచే ఎప్పటికప్పుడు గ్రౌండ్ శుభ్రపరచడం జరుగుతుందని తెలిపారు.
తొలిరోజు వేడుకల్ని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్) వారి చేతులు మీదుగా ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. క్రీడాకారులు తొలి రోజు నిర్వహించే ప్రారంభ వేడుకల రిహార్సల్స్ ను ఆర్డీవో పరిశీలించారు.
ఆర్డీవో వెంట సంబంధించిన శాఖల అధికారులు పాల్గొన్నారు.
-------------------------------
డివిజనల్ పిఆర్వో, సమాచార శాఖ, కొవ్వూరు వారిచే జారీ
addComments
Post a Comment