ఫెర్టిలైజర్స్ సబ్సీడీని 25 శాతం తగ్గించి రైతులకు అన్యాయం చేశారన్నారు.

  న్యూఢిల్లీ – ఫిబ్రవరి 9,  (ప్రజా అమరావతి) :    

కేంద్ర బడ్జెట్ పై వైసీపీ ఎంపీల మీడియా సమావేశం

కేంద్ర బడ్జెట్ పై ఈ రోజు సాయంత్రం ఆంధ్ర ప్రదేశ్ భవన్ లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన వైసీపీ ఎంపీల మీడియా సమావేశంలో ఎం.పీ లు లావు కృష్ణదేవరాయలు, మార్గాని భరత్, నందిగామ సురేశ్ లు పాల్గొన్నారు.    ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 

ఫెర్టిలైజర్స్ సబ్సీడీని 25 శాతం తగ్గించి రైతులకు అన్యాయం చేశారన్నారు. 


పీఎం గరీభ్ అన్న యోజన పథకం ప్రస్తావన బడ్జెట్ లో లేదన్నారు . 

ఉపాధి హామీ పథకానికి కూడా బడ్జెట్ కేటాయింపులు తగ్గించారన్నారు.

గ్రామీణాభివృద్ధి పథకాలకు కేటాయింపులు తగ్గించారన్నారు. 

స్వయం సహాయక పథకాలకూ బడ్జెట్ లో నిధులు తగ్గించారన్నారు. 

కరోనా సమయంలో ప్రజలకు సంక్షేమ పథకాలు చేరేలా బడ్జెట్ ఉండాలని నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ కూడా సూచించారన్నారు. 

కరోనా లో ప్రజలను ఆదుకోవాల్సింది పోయి  సబ్సిడీల్లో కోతలు పెట్టారన్నారు. 

కేంద్ర బడ్జెట్ పేదలు, రైతులకు వ్యతిరేకంగా ఉందన్నారు . 

కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందన్నారు. 


Comments