విజయవాడ (ప్రజా అమరావతి);
*ఘనంగా 7 అకాడమీల డైరెక్టర్స్/సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం
*..
- *ముఖ్యఅతిధిగా పాల్గొన్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు*
తెలుగు సాహిత్యం అభివృద్ధి, సంగీత నృత్యాల వికాసానికి ఆధునిక ఆవిష్కరణల లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 7 అకాడమీలను పునరుద్దరించిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) తెలిపారు. మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతిక సమితి అకాడమీ మెంబర్స్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొని సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారిని శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేస్తూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మేరుగ నాగార్జున లు నూతన డైరెక్టర్లు/సభ్యులకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వెనుబడిన తరగతుల వారికి వెన్నుదన్నుగా నిలిచి, రాష్ట్రంలో వివిధ బీసీ కార్పోరేషన్లు ఏర్పాటుతో సహా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. బీసీ కులాల వారికి వెన్నుదన్నుగా నిలిచి, వారి సంక్షేమానికి సీఎం కృషి చేస్తున్నారన్నారు. సీఎం జగన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం మహిళా సాధికారిత దిశగా మహిళలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు అన్ని రంగాల్లోను మహిళల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. తెలుగు సాహిత్యం అభివృద్ధి, సంగీత నృత్యాల బహుముఖ పురోగతి, పద్య మరియు ఆధునిక నాటక వికాసం, శిల్ప, చిత్ర కళల అభివృద్ధి, జానపద కళా రూపాల అభివృద్ధి మరియు ఆధునీకరణ, తెలుగు ప్రజల చారిత్రక పరిశోధన మరియు ఆవిష్కరణ, టెక్నాలజీ మరియు డిజిటల్ రంగాలకు సంబంధించిన ఆధునిక ఆవిష్కరణ లక్ష్యాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7అకాడమీలను పునరుద్ధరించిదని మంత్రి అవంతి తెలిపారు. సాహిత్య అకాడమీ, సంగీత నృత్య అకాడమీ, నాటక అకాడమీ, దృశ్య కళల అకాడమీ, జానపద కళల అకాడమీ, చరిత్ర అకాడమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీలుగా పునరుద్దరించబడ్డాయని.. ఈ అకాడమీలకు చైర్ పర్సన్స్/చైర్మెన్లను ఇదివరకే నియమించామని తెలిపారు. పైన తెలిపిన అకాడమీలకు డైరెక్టర్లు / సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేసిన డైరెక్టర్లు/సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించడం ఆనందంగా ఉందన్నారు. నూతనంగా ఎన్నికైన వీళ్లందరూ తమ, తమ అకాడమీల కీర్తి, ప్రతిష్టలను పెంచేలా కృషిచేయాలని మంత్రి అవంతి కోరారు.
నూతన డైరెక్టర్లు/సభ్యులతో పాటు సాహిత్య అకాడమీ ఛైర్ పర్సన్ శ్రీమతి పి. శ్రీలక్ష్మి, సంగీత నృత్య అకాడమీ ఛైర్ పర్సన్ శ్రీమతి పి. శిరీష యాదవ్, నాటక అకాడమీ ఛైర్ పర్సన్ శ్రీమతి ఆర్. హరిత, దృశ్యకళల అకాడమీ ఛైర్ పర్సన్ శ్రీమతి కుడుపూడి సత్య శైలజ, జానపద కళల ఛైర్మన్ శ్రీ కె. నాగభూషణం, చరిత్ర అకాడమీ ఛైర్ పర్సన్ శ్రీమతి కె. నాగమల్లేశ్వరి, సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ ఛైర్ పర్సన్ శ్రీమతి టి. ప్రభావతి సభ్యుల ప్రమాణస్వీకారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి ఛైర్మన్ శ్రీమతి వంగపండు ఉష, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ, సీఈవో మల్లిఖార్జున రావు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment