టీటీడీ కి రూ. 9 కోట్ల 20 లక్షలు విరాళం
– ఇందులో రూ 3 కోట్ల 20 లక్షలు చిన్నపిల్లల ఆసుపత్రికి
– రూ 6 కోట్ల ఆస్తి స్వామివారికి
– టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డికి పత్రాలు అందించిన దాత సోదరి
తిరుమల 17 ఫిబ్రవరి (ప్రజా అమరావతి): టీటీడీ కి గురువారం రూ 9 కోట్ల 20 లక్షల విరాళం అందింది. ఇందుకు సంబంధించిన పత్రాలను దాత స్వర్గీయ డాక్టర్ ఆర్ పర్వతం జ్ఞాపకార్థం ఆమె సోదరి శ్రీమతి రేవతి విశ్వనాథం శ్రీవారి ఆలయంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి అందజేశారు.
చెన్నె మైలాపూర్ కు చెందిన స్వర్గీయ డాక్టర్ పర్వతం పేరు మీద బ్యాంకు లో రూ 3 కోట్ల 20 లక్షల నగదు డిపాజిట్లు ఉన్నాయి. దీంతోపాటు రూ 6 కోట్ల విలువైన రెండు ఇళ్ళు ఉన్నాయి. డాక్టర్ పర్వతం కన్నుమూయడంతో ఆమె జ్ఞాపకార్థం ఆమె సోదరి శ్రీమతి రేవతి విశ్వనాథం ఈ ఆస్తిని శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పత్రాలను శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి అందజేశారు.
addComments
Post a Comment