కొవ్వూరు (ప్రజా అమరావతి);
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పధకాలకు, అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని రాష్ట్ర హోమ్ మంత్రి మేకతోటి సుచరిత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.
కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో మంగళవారం జరిగిన పలు అభివృద్ధి ప్రారంభోత్సవాల కార్యక్రమంలో మంత్రి తానేటి వనిత, హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత, జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ , డిసిసిబి చైర్మన్ పీవీల్ నరసింహారాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, తమ ప్రభుత్వం రైతు, మహిళా పక్షపాతి ప్రభుత్వం
అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లో సాగు నుంచి కొనుగోలు వరకు ప్రతి దశలోనూ రైతులకు అండగా నిలుస్తున్నామన్నారు. మహిళలకు అండగా నిలిచి దిశా చట్టం తీసుకుని వొచ్చి, దిశయాప్ ద్వారా మహిళలకు తక్షణమే రక్షణ కల్పించే దిశగా చర్యలు చేపట్టామన్నారు.
పర్యటన లో భాగంగా కాపవరం గ్రామంలో రూ.21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రానికి, రూ.17.5 లక్షలతో నిర్మించిన వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ను ప్రారంభించారు. అనంతరం కాపవరం గ్రామంలో జగనన్న కాలనీల్లో లబ్ధిదారులు నిర్మించుకున్న పలు నూతన గృహా ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నారు. కాపవరం గ్రామంలో దిశా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి కాకర్ల నారాయుడు, జెడ్పిటిసి బొంతా వెంకటలక్ష్మి, మునిసిపల్ ఛైర్ పర్సన్ బావన రత్నకుమారి, డిసిసిబి డైరెక్టర్ బండి లక్ష్మీ నారాయణమ్మ, ఏఎంసి చైర్మన్ వల్లభనేని శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, సర్పంచ్ సుంకర పద్మినీ, మండలాధ్యక్షులు సుంకర సత్యనారాయణ, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తొలుత కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం కోసం విచ్చేసిన రాష్ట్ర హోమ్ మంత్రి మేకతోటి సుచరితకి కొవ్వూరు లోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి తానేటి వనిత, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
addComments
Post a Comment