ఎరువుల షాపును సీజ్ చేసిన వ్యవసాయ అధికారి


 కొల్లిపర ప్ర(అమరావతి); కొల్లిపర మండలంలోని కొల్లిపర గ్రామంలో శ్రీ ఆంజనేయ ట్రేడర్స్ ఎరువుల షాపు నందు   శనివారం మండల వ్యవసాయ విస్తరణ అధికారి కె. వెంకట్రావు ఎరువుల షాపు ను తనిఖీ చేసినారు. ఈ తనిఖీల్లో షాపు యజమాని ఎలాంటి రికార్డు లేకుండా వ్యాపారం సాగిస్తున్నారు. రైతులకు ఎలాంటి బిల్లులు ఇవ్వకుండా అనధికారికంగా వ్యాపారం సాగిస్తున్నారు. భౌతికంగా షాపులో నిల్వ ఉన్న 400 యూరియా బస్తాలు విలువ  1,06,600 గల ఎరువులను సీజ్ చేసినారు. ఎరువుల డీలర్ పై నిత్యావసర సరుకుల చట్టం సెక్షన్ 6-ఏ క్రింద జాయింట్ కలెక్టర్, గుంటూరు కోర్టులో కేసు నమోదు చేసినారు. ఈ తనిఖీలో ఎం ఆదిలక్ష్మి A E O, పంచాయతీ కార్యదర్శి ఉమా మహేశ్వర్ రెడ్డి , వి ఆర్ ఓ ఈ పూరి సురేష్ బాబు, శివయ్య పాల్గొన్నారు. మండలంలో ఎవరైనా  డీలర్లు అధిక ధరలకు ఎరువులను అమ్ముతుంటే ఫిర్యాదు చేయవలసిందిగా కోరారు.

Comments