ఆంధ్రప్రదేశ్ పుణ్యస్థలాలో కొటప్పకొండ ఒకటి

 కొటప్పకొండ 


ఆంధ్రప్రదేశ్ పుణ్యస్థలాలో కొటప్పకొండ ఒకటి


గుంటూరు జిల్లాలోని నరసారావుపేటకి 13 km

దూరంలో గల ఈక్షేత్రానికి ఎప్రాంతం నుండయిన

సులభంగా చేరుకోవచ్చు రైలు మార్గంలో అయితే

గుంటూరు - గుంతకల్లు మార్గంలోని  నరసారావుపేట చేరుకుని

ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు నరసారావుపేట నుండి ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం ప్రైవేట్‌ వాహనాల సౌకర్యాలు ఉన్నాయి


             🔱క్షేత్రప్రభావం🔱


చతుర్థశ భువనాలు శివమయ సంధానాలు

మంగళకరు మగు శివ శబ్దము సకల చరాచర 

జీవకోటికి ఆధారము పరమేశ్వరుడు అది అంతాలు లేని సర్వ వ్యాపనమైన చైతన్యశక్తి

అట్టి శక్తికి గుర్తు గుండ్రని రూపం అందుకే

శివుడిని లింగాకారంగా అర్చన చేస్తున్నాం

అ లింగమే " త్రికొటేశ్వరుడు " అయనే

కొటప్ప అంతటి మహత్కృష్టమైన క్షేత్రమే

త్రికూటాచలం అదియే కొటప్పకొండ.


 పవిత్రమైనచారిత్రక క్షేత్రాలలో కొటప్పకొండ ప్రసిద్ధమైన అతి ప్రాచీన శైవక్షేత్రం కృత,త్రేతా,ద్వాపర, యుగాల నుండి పూణ్యభూమిగా పరిగణింపబడుచున్న

భారతదేశంలోని దక్షిణ భాగంలో అపర కైలాష క్షేత్రంగా పేరొందిన "త్రికొటేశ్వరస్వామి"కి

నిలయమైన దివ్య భక్తి పదమం కొటప్పకొండ.


పిలిచిన పలికే ప్రసన్న కొటేశ్వరుడిగా కష్టాలనుండి కడదేర్చే కావురు త్రికొటేశ్వరుడునిగా ఆపదలో ఆదుకునే చేదుకో కోటయ్యగా సంతానం లేనివారికి సంతానాన్ని కలగజేసే సంతానకొటేశ్వరునిగా యుగ యుగాల నుండి

నేటివరకు భక్తులు అరాద్యంగా విరాజామాన మగుచు కోరిన వారికి కొంగు బంగారంగా విరజిమ్ముతూ సుకము,శాంతి,ఆరోగ్యము, ఐశ్వర్యము, రక్షణ, శుభము,విజయము, ఆవలీలగా అనూహ్యంగా ప్రసాదించే 

కొటేశ్వర సన్నిధానం కొటప్పకొండ.

Comments