శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము

 శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము


, ఇంద్రకీలాద్రి,విజయవాడ (ప్రజా అమరావతి):   అంధ్రప్రదేశ్ రాష్త్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి  కుటుంబ సభ్యులతో  కలిసి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం  రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుల వారు కుటుంబసభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ స్థానాచార్యులు వారు మరియు వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి  శ్రీ అమ్మవారి ప్రసాదములు, వస్త్రములు మరియు చిత్రపటం అందజేశారు. అనంతరం వీరు శ్రీమల్లేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.

Comments