అక్రమ లే అవుట్లపై కఠిన చర్యలు: సీఆర్డీఏ కమిషనర్ విజయకృష్ణన్
అనధికారికంగా నిర్మాణం చేపడుతున్న లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) కమిషనర్ శ్రీమతి విజయకృష్ణన్, ఐఏఎస్ హెచ్చరికలు జారీచేశారు. కమిషనర్ వారి ఆదేశాలను అనుసరించి శనివారం సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు గుంటూరు జిల్లా నారా కోడూరులో నిర్మాణం చేపట్టిన అక్రమ లే అవుట్లను తొలగించారు. జేసీబీ యంత్రంతో లే అవుట్‌లో అభివృద్ధి చేసిన ముఖ్యమైన మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్మూలించారు. అనధికార లే అవుట్ల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఇకపై ఇటువంటి నిర్మాణం ఉపేక్షించబోమని కమిషనర్ స్పష్టం చేశారు. క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఎక్కడ అనధికార నిర్మాణాలు చేపట్టినా వాటిని వెంటనే తొలగించడమే కాకుండా అభివృద్ధి చేపడుతున్న వారిపై సీఆర్డీఏ చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. అనధికార లే అవుట్లలోని ఫ్లాట్ల సర్వే నెంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ శాఖలో నిషేధిత భూమిగా నమోదు చేయిస్తామని పేర్కొన్నారు.
addComments
Post a Comment