కొవ్వూరు (ప్రజా అమరావతి);
మార్చి 8న విజయవాడలో అత్యంత ఘనంగా రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ, మహిళా కమిషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతున్నదని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.
సోమవారం స్థానిక జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన జాతీయ సైన్స్ దినోత్సవాని కి స్థానిక శాసన సభ్యులు జి. శ్రీనివాస్ నాయుడు తో కలిసి మంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, కరోనా పరిస్థితుల నేపధ్యంలో గత రెండు సంవత్సరాలుగా మహిళా దినోత్సవాన్ని అనుకునంతస్థాయిలో నిర్వహించుకోలేక పోయమన్నారు.
ఈ ఏడాది విజయవాడలో మహిళా దినోత్సవం కోసం వివిధ స్థాయిల్లో ఉన్న మహిళా ప్రజా ప్రతినిధులు తో సమావేశం నిర్వహించి, ఈరాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మహిళల సంక్షేమం కోసం చేసిన వాటిపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. విజయవాడలో ని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి మహిళా సదస్సు నిర్వహించానున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈకార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొనడం జరుగుతుందని ఆమె తెలిపారు. మహిళల సంక్షేమానికి, వారి కుటుంబాల ఆర్ధిక పరిస్థితి మెరుగు పరచడానికి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్న మన్నారు. అంతే కాకుండా మహిళ ల భద్రత అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వారిలో భరోసాను నిమౌతున్నామని పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాలలో రాష్ట్రంలో మహిళా ల ఆర్ధిక పురోగతిపై తీసుకున్న నిర్ణయం, సంక్షేమ పథకాలు, వాటి వల్ల కలిగిన ప్రయోజనాలపై ఈ వేదికపై చర్చించు కోవడం జరుగుతుందని తానేటి వనిత తెలిపారు. ఈ వేడుకలలో ప్రజా క్షేత్రంలో ఎన్నుకోబడిన మహిళ ప్రజా ప్రతినిధులు ఎంపీ నుంచి గ్రామ వార్డు సభ్యురాలు వరకు, మహిళా మంత్రులు, శాసన సభ్యురాళ్లు, జెడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచ్ లు, వార్డు సభ్యురాళ్లు వరకు ఉన్న వారందరినీ భాగస్వామ్యం చేస్తున్నట్లు ఆమె వివరించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు అనైతికంగా విమర్శలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మహిళలు ముఖ్యమంత్రి గా ఉన్నా కూడా ఆయా ప్రభుత్వాలు ఎవ్వరూ అమలు చెయ్యని సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతోందని తెలిపారు.
ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం:
.నిడదవోలు జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవం లో మంత్రి తానేటి వనిత, స్థానిక శాసన సభ్యులు జి. శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. సర్ సివి రామన్ భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి రామన్ ఎఫెక్ట్ ద్వారా తెలియ చేశారన్నారు. భౌతిక శాస్త్రంలో ఆయన చేసిన అవిష్కరణకి భౌతిక శాస్త్రం లో నోబెల్ బహుమతి పొందడం జరిగిందన్నారు. నేటి యువత ఇంటర్నెట్, ఆన్లైన్ గేములకి ఆకర్షితులై పోతున్నారని తెలిపారు. మీలో ఉన్న జిజ్ఞాస తో నూతన ఆవిష్కరణలు చెయ్యడం లో సర్ సివి రామన్ న్నీ స్ఫూర్తి గా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని, విద్యార్థులు రూపొందించిన పలు అంశాలను పరిశీలించారు. అనంతరం క్విజ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు.
addComments
Post a Comment