ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకురావడంలో కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించాన్న సీఎం.



ఆదాయాన్ని ఆర్జించే శాఖలతో సీఎం సమీక్ష


అమరావతి (ప్రజా అమరావతి):

– ఆదాయాన్ని ఆర్జించే శాఖలతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

– అదనపు ఆదాయాలకోసం వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం. 

– ఎస్‌ఓఆర్‌ ( రాష్ట్రాల సొంత ఆదాయం)ను పెంచుకోవడానికి ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి పద్ధతులు, విధానాలు పాటిస్తున్నారో పరిశీలించాలన్న ముఖ్యమంత్రి. 

– తద్వారా రాష్ట్ర సొంత ఆదాయాలు పెరగడానికి తగిన ఆలోచనలు చేయాలన్న సీఎం.

– వీటిని కార్యరూపంలోకి తీసుకురావడానికి తదేక దృష్టిపెట్టాలనససీఎం.  

– ఈ అంశాలపై ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించుకోవడానికి సంబంధిత శాఖలకు చెందిన అధికారులు క్రమం తప్పకుండా సమావేశం కావాలన్న ముఖ్యమంత్రి. 

– ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకురావడంలో కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించాన్న సీఎం. 


– పారదర్శక విధానాలను పాటిస్తూ ముందుకు సాగాలన్న సీఎం. 

– రాబడులను పెంచుకునే క్రమంలో అధికారులు తమ విచక్షణాధికారాలను వాడేటప్పుడు కచ్చితమైన ఎస్‌ఓపీలను పాటించాలన్న సీఎం. 

– పెండింగ్‌లో ఉన్న వ్యాట్‌ కేసులను పరిష్కరించడంద్వారా బకాయిలను రాబట్టుకోవడంపై దృష్టిసారించాలి. 


– గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వీలైనంత త్వరగా వేగవంతం చేయాలని సీఎం ఆదేశం

– 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే అందుతున్న రిజిస్ట్రేషన్‌ సేవలను సమీక్షించి... తగిన మార్పులు, చేర్పులు చేయాలన్న సీఎం

– సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వెలుగుచూసిన అవినీతి ఘటనలు, లోపాలు తిరిగి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రవేశించకూడదన్న సీఎం

– ఆమేరకు పటిష్టమైన ఎస్‌ఓపీలను అమలు చేయాలన్న సీఎం


ఉచిత రిజిస్ట్రేషన్ల వల్ల పేదలకు భారీ లబ్ధి:

– ఉచితంగా రిజిస్ట్రేషన్లు వల్ల భారీగా పేదలకు భారీగా లబ్ధి చేకూరిందన్న అధికారులు. 

– ఓటీఎస్‌ పథకం ద్వారా, ఉచిత రిజిస్ట్రేషన్ల రూపేణా పేదలకు ఇప్పటివరకూ రూ.400.55 కోట్ల లబ్ధి చేకూరిందన్న అధికారులు. 

– టిడ్కో ఇళ్ల ఉచిత రిజిస్ట్రేషన్ల రూపేణా పేదలకు మరో రూ.1230 కోట్ల మేర లబ్ధి చేకూరిందన్న అధికారులు.

– గతంలో ఎన్నడూకూడా ఉచిత రిజిస్ట్రేషన్ల రూపంలో పేదలకు ఇంతటి ప్రయోజనం జరగలేదన్న అధికారులు.

Comments