*పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం..తెగిపడ్డ డ్రైవర్ చేయి
*
పెద్దపల్లి (ప్రజా అమరావతి): పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల ప్రకారం.....విశాఖపట్నం నుండి చంద్రపూర్‌కు ఓ లారీ బొగ్గు లోడుతో వెళ్తుంది.
అయితే, పెద్దపల్లి జిల్లాలోని శాంతినగర్ హనుమాన్ విగ్రహం మూల మలుపు వద్దకు రాగానే లారీ డివైడర్ ఎక్కి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ లింగస్వామి కుడి చెయ్యి తెగి పడగా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ డ్రైవర్‌ను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, డ్రైవర్ లింగస్వామి స్వస్థలం కృష్ణాజిల్లాలోని చిల్లకల్లు గ్రామం.
addComments
Post a Comment