సోమవారం డయల్ యువర్ కలెక్టర్ మరియు ప్రజల నుండి వినతి ప్రత్రాలు స్వీకరించే స్పందన కార్యక్రమం

  గుంటూరు, ఫిబ్రవరి 19, (ప్రజా అమరావతి) :-. ఈ నెల 21 వ తేది *సోమవారం  డయల్ యువర్ కలెక్టర్ మరియు ప్రజల నుండి  వినతి ప్రత్రాలు స్వీకరించే స్పందన కార్యక్రమం  కలెక్టరేట్ లోని ఎస్. ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్య నేడొక ప్రకటనలో పేర్కొన్నారు.  ఫిబ్రవరి 21 వ తేది ఉదయం 10 గంటల  నుండి ఉదయం 11 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ఉంటుందన్నారు.  అనంతరం ఉదయం 11 గంటల నుండి స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందని*  డీఆర్ఓ  ఆ ప్రకటనలో తెలిపారు.  కావున జిల్లా ప్రజలు స్పందన కార్యక్రమం ద్వారా సమస్యలను పరిష్కరించుకునే  సౌలభ్యాన్ని వినియోగించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి  ఆ ప్రకటనలో తెలిపారు.