నిరుపేదల కోసం జాయింట్ రిప్లేస్మెంట్ నిరంతరం కొనసాగాలి

 నిరుపేదల కోసం  జాయింట్ రిప్లేస్మెంట్  నిరంతరం కొనసాగాలి



 జిజిహెచ్ కు రూ 15 లక్షల ఇంప్లాంట్స్ వితరణ


 డాక్టర్ బూసి రెడ్డి నరేందర్ రెడ్డి


 డాక్టర్ రెడ్డితో జి జి హెచ్  కు  మరింత ప్రతిష్ట


 ఆర్థో విభాగాధిపతి డాక్టర్ గంటా వరప్రసాద్

గుంటూరు (ప్రజా అమరావతి);

        నిరుపేదల కోసం ఖరీదైన మోచిప్పల మార్పిడి శస్త్రచికిత్సలు గుంటూరు ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి లో నిరంతరం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రముఖ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, ఉన్నతి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బి సి రెడ్డి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవలే జీజీహెచ్లో నూరు మోచిప్పల మార్పిడి శస్త్రచికిత్సలను ప్రభుత్వ, జి జి హెచ్ ఆర్థో  విభాగం, ఉన్నతి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యం.. సహకారంతో విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇంతటితో ఆగకుండా సత్తా చికిత్సలకు అర్హులైన నిరుపేదల కోసం ఆపరేషన్లు కొనసాగేలా పదిహేను లక్షల రూపాయల విలువైన ఇంప్లాంట్స్ను అందజేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం అరండల్ పేట లోని ఓ హోటల్ లో జిజిహెచ్ ఎముకలు కీళ్ళ విభాగాధిపతి డాక్టర్ గంట వరప్రసాద్ తో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో 25 ఇంప్లాంట్స్ను ఉన్నతి ఫౌండేషన్ ద్వారా అందజేయడంతో పాటు ఎటువంటి ఫీజు తీసుకోకుండా ఉచితంగా 100 ఆపరేషన్లు నిర్వహించామని తెలిపారు. దీనికి ప్రభుత్వ సహకారం,విభాగాధిపతి డాక్టర్ గంటా వరప్రసాద్, అక్కడి  వైద్యుల కృషి ఎంతగానో ఉందని అన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని కలిసి ప్రధానమైన ప్రభుత్వ ఆసుపత్రులలో మో చిప్పల మార్పిడి శస్త్ర చికిత్సలు కొనసాగేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాల్సిందిగా కోరనున్నట్లు చెప్పారు.

     జిజిహెచ్ ఆర్థో విభాగాధిపతి డాక్టర్ గంటా వరప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ నరేందర్ రెడ్డి కి ఉన్న మానవతా దృక్పథం కారణంగా జి హెచ్ ప్రతిష్ట మరింత పెరిగిందని తెలిపారు. గతంలో ఒకేరోజు జీజీహెచ్లో10 మొచిప్ప ల మార్పిడి ఆపరేషన్లు నిర్వహించి ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకువచ్చారు అని గుర్తు చేశారు. జిజిహెచ్ కు వచ్చి ఎటువంటి ఫీజు తీసుకోకుండా ఆపరేషన్ నిర్వహించడంతోపాటు యువ వైద్యులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి మెలుకువలు నేర్పడం  డాక్టర్ రెడ్డి మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనమని అన్నారు. కార్పొరేట్ ఆసుపతృల్లో సైతం  జాయింట్ రీప్లేస్ మెంట్ లో సరాసరి  5% ఇన్ఫెక్షన్ రేటు ఉంటుందని అటువంటిది  జి జి హెచ్  లో జీరో పర్సెంట్ ఇన్ఫెక్షన్ వైద్యుల పనితీరుకు నిదర్శనం అని తెలిపారు.

 అనంతరం డాక్టర్ నరేందర్ రెడ్డి ఇంప్లాంట్స్ ను డాక్టర్ వరప్రసాద్  బృందానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు  ఎరగూటి సాంబశివారెడ్డి, కొనకండ్ల శ్రీనివాస్, మర్రెడ్డి శివారెడ్డి,   అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Comments