ఘనంగా ఛత్రపతి శివాజి జయంతి వేడుక

 ఘనంగా ఛత్రపతి శివాజి జయంతి వేడుకవిశ్వహిందూ పరిషత్ , బజరంగ్ దళ్ ఆధ్వర్యములో శోభాయాత్ర


ఒంగోలు (ప్రజా అమరావతి): హిందూ సామ్రాజ్యాన్ని స్ధాపించి మొఘలాయుల ఆక్రమణకు అడ్డు కట్టవేసిన ధీరోదాత్తుడు తల్లి జిజియాబాయి నేర్పిన హిందూ ధర్మ రక్షణలను తమ పతాకగ స్వీకరించి  భవానిమాత వరప్రసాదమైన ఖడ్గం చేపట్టి దుష్ట దుర్మార్గపు మొఘలాయిలను చిత్తుచేసిన ధీరోదాత్తుడు మరాఠావీరుడు ఛత్రపతి శివాజి మహరాజ్ గా పేరొందిన శివాజి రాజే భోంస్లే జన్మదినోత్సవమును ఘనంగా నిర్వహించిన అరమరాఠా సంఘం,  విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్, దుర్గావాహిని, భారతీయ జనతాపార్టి మరియు వివిధ హైంధవ సంఘ కార్యకర్తలు.


శనివారం ఉదయం 10:30 గం.లకు స్థానిక కర్నూల్ రోడ్డు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద నుండి నిలువెత్తు శివాజి చిత్రమును వాహనముపై ఊరేగిస్తూ, కాషాయ పతాకాలు చేపట్టి యువకులు "జై భవాని - వీర శివాజి" అంటూ నినాదాలు చేస్తూ రంగుతోట, మరాఠాపాలెం లోని శివాజి కాంశ్యవిగ్రహం వద్దవరకు అద్దంకి బస్టాండు, కలక్టరేట్, కొత్తపట్నం బస్టాండు మీదుగా  బైక్ ర్యాలిని నిర్వహించారు, ర్యాలిలో మహిళలు, యువతులు సైతం ర్యాలిలో పాల్గొన్నారు. 


కార్యక్రమములో అరెమరాఠా సంఘ గౌరవాధ్యక్షులు దయిండే ప్రభాకర్, మరాఠా సంఘ నగర అధ్యక్షులు కాళే వేంకటేశ్వర్లు, శివ తదితర కమిటి సభ్యులు మరియు విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లిఖార్జున రావు, కార్యదర్శి పందరబోయిన పున్నారావు, ఐ సీతారామయ్య, విహెచ్.పి నగర అధ్యక్షులు పసుమర్తి వేంకటేశ్వర్లు, నేరెళ్ల శ్రీనివాసరావు, సిహెచ్ నాగరాజు, కనిగెర్లపూడి వెంకట్రావు, అయిత సత్యనారాయణ, భారతీయ జనతాపార్టి జిల్లా  అధ్యక్షులు సిరసనగుండ్ల శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు పి. శివారెడ్డి, మఠపల్లి దుర్గేష్, గుర్రం సత్యనారాయణ, ధనిశెట్టి రాము,  తదితరులు పాల్గొన్నారు.

Comments