విజయవాడ (ప్రజా అమరావతి); డివిజన్ పరిధి నరసాపురం-భీమవరం, భీమవరంటౌన్-ఆరవల్లి, నరసాపురం-భీమవరం-నిడదవోలు రూట్లలో కొత్తగా ఏర్పాటు చేసిన డబ్లింగ్ రైల్వే మార్గంలో సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు పనుల్లో భాగంగా ఈ నెల 28 నుంచి మార్చి 3 వరకు భీమవరం మీదుగా వెళ్లే పలు రైళ్లను ఏలూరు-నిడదవోలు మీదుగా మళ్లిస్తున్నట్లు నరసాపురం స్టేషన్ మేనేజరు మధుబాబు తెలిపారు. సికింద్రాబాద్-భువనేశ్వర్, బెంగళూర్-కాకినాడటౌన్, లింగంపల్లి-కాకినాడటౌన్, విశాఖపట్నం-ముంబయి ఎల్‌టీటీ, ముంబయిఎల్‌టీటీ-విశాఖపట్నం, చెంగల్‌పట్టు-కాకినాడపోర్టు, ఎర్నాకులం-టాటానగర్, పూరి-తిరుపతి, బిలాస్‌పూర్-తిరుపతి, కాకినాడపోర్టు-చెంగల్‌పట్టు, కాకినాడటౌన్-బెంగళూర్, భువనేశ్వర్-సికింద్రాబాద్, తిరుపతి-పూరి, కాకినాడటౌన్-లింగపల్లి రైళ్లు ఏలూరు-నిడదవోలు మార్గంలో నడుస్తాయన్నారు.
సమయాల్లో మార్పులు.. నాగర్‌సోల్, ధర్మవరం, లింగంపల్లి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయాలను ఈ నెల 24 నుంచి 28 వరకు మార్చినట్లు తెలిపారు. నరసాపురం-నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 11.05 బదులుగా మధ్యాహ్నం 2.20కు, ధర్మవరం సాయంత్రం 5.30 బదులుగా రాత్రి 7.25కు, లింగంపల్లి సాయంత్రం 6.50కు బదులుగా రాత్రి 7.45కు నరసాపురంలో బయలుదేరుతాయన్నారు.
ఇవి రద్ధు. నరసాపురం నుంచి విజయవాడ, నిడదవోలు మార్గాల్లో ప్రయాణించే అన్ని డెమో ఎక్స్‌ప్రెస్‌లు, పాస్ట్‌ప్యాసింజరు, ప్యాసింజరు రైళ్లు ఈ నెల 24 నుంచి మార్చి 3 వరకు రద్దు చేసినట్లు మధుబాబు తెలిపారు
addComments
Post a Comment