కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జయశంకర్‌కు సీఎం వైయస్‌.జగన్‌ ఫోన్‌



*కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జయశంకర్‌కు సీఎం వైయస్‌.జగన్‌ ఫోన్‌






*

*ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను క్షేమంగా తీసుకురావడంపై చర్చ*

*తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్న సీఎం*

*కేంద్రం అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటోందని వివరించిన జయశంకర్‌*

*ఉక్రెయిన్‌ పక్కదేశాలకు తరలించి అక్కడనుంచి ప్రత్యేక విమానాల ద్వారా తీసుకొచ్చే దిశగా ముమ్మర చర్యలు తీసుకుంటామన్న కేంద్రమంత్రి*


*అంతకుముందు క్యాంప్ కార్యాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమావేశం*

*ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొన్న సీఎస్, సీఎంఓ అధికారులు, ఏపీ స్పెషల్‌ ఆఫీసర్‌ (ఇంటర్నేషనల్‌ కోపరేషన్‌) జితేష్‌ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి*

*రాష్ట్రస్థాయిలో ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను వివరించిన అధికారులు*

*కలెక్టర్ల స్థాయిలో కాల్‌సెంటర్ల ఏర్పాటుకు సీఎం ఆదేశం*

*రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్కరితో కమ్యూనికేషన్‌ ఏర్పాటు చేసుకోవాలన్న సీఎం*

*వారి యోగక్షేమాలను కనుక్కుంటూ వారి భద్రతకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్న సీఎం*

*ఎప్పటికప్పుడు వారితో సంప్రదిస్తూ తగిన మార్గనిర్దేశం చేయాలన్న సీఎం*

*కేంద్ర ప్రభుత్వాధికారులకు అవసరమైన సమాచారాన్ని అందించాలన్న సీఎం*

*అక్కడున్న తెలుగువారి నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా దాన్ని విదేశాంగశాఖ అధికారులకు చేరవేయాలన్న సీఎం*

*అవసరమైతే ప్రత్యేక విమానాల ద్వారా తరలింపులో రాష్ట్రం నుంచి తగిన సహకారానికి ఆదేశం*


అమరావతి (ప్రజా అమరావతి);

రష్యా – ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను, తెలుగువారిని క్షేమంగా తిరిగి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. ఈమేరకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్, కేంద్ర విదేశాంగశాఖ మంత్రి శ్రీ జయశంకర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో ఉంటున్న తెలుగువారిని క్షేమంగా వెనక్కి తీసుకొచ్చే విషయమై చర్చించారు. కేంద్రం తీసుకుంటున్న చర్యలను శ్రీ జయశంకర్, ముఖ్యమంత్రికి వివరించారు. ఉక్రెయిన్‌ పక్కనున్న దేశాలకు వారిని తరలించి అక్కడ నుంచి ప్రత్యేక విమానాల ద్వారా భారత్‌కు తీసుకు వచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఎలాంటి ముప్పులేకుండా వారిని భద్రంగా తీసుకురావాలని సీఎం, కేంద్రమంత్రికి విజ్ఞప్తిచేశారు. ఈ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 


అంతకుముందు ఇదే అంశంపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, ఢిల్లీలో ఏపీ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి అంతర్జాతీయ సహకారంపై ప్రత్యేక అధికారి జితేష్‌ శర్మలు పాల్గొన్నారు. 


రాష్ట్రానికిచెందిన తెలుగు విద్యార్థులను ఉక్రెయిన్‌నుంచి క్షేమంగా వెనక్కి తీసుకురావడంపై కేంద్ర విదేశాంగశాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నామని సీఎంకు వివరించారు. ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి అయ్యిందన్నారు. జిల్లా కలెక్టర్ల స్థాయిలో కంట్రోల్‌ రూమ్స్‌ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. విద్యార్థుల వివరాల సేకరణతో పాటు, వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాలన్నారు. కాల్‌సెంటర్లకు ఎలాంటి సమాచారం వచ్చినా వెంటనే దాన్ని విదేశాంగశాఖ అధికారులకు చేరవేసి ఫాలోఅప్ చేయాలన్నారు.

Comments