మంగళగిరి లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో పేదలకు గృహాలను నిర్మించిన ఘనత తెలుగుదేశం పార్టీదే.



ఆళ్ల రామకృష్ణారెడ్డి అసమర్థత, చేతకానితనానికి వైఫల్యానికి,  నిదర్శనం ఇప్పటికీ పి ఎం ఏ వై లబ్ధిదారులకు ఇళ్ళను అప్ప చెప్పకపోవడం.


మంగళగిరి లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో పేదలకు గృహాలను నిర్మించిన ఘనత తెలుగుదేశం పార్టీదే.



ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతగానితనం వల్ల లబ్ధిదారులు, అద్దె రూపంలో, వడ్డీల రూపంలో కొన్ని లక్షల రూపాయల నష్టం వాటిల్లింది.


పి ఎం ఎ వై గృహాలపై పాదయాత్రలో ఎలాంటి లోన్ లేకుండా ఉచితంగా ఇప్తామని హామీ ఇచ్చి, మడమ తిప్పిన జగన్ రెడ్డి.


బ్యాంకు లింకేజీ ల పేరుతో లబ్ధిదారులను ఇబ్బందులు పెడుతున్న జగన్ రెడ్డి ప్రభుత్వం.


నెల రోజుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పీఎంఏవై గృహాలను పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అప్పగించాలి.


- తెలుగుదేశం పార్టీ నాయకుల డిమాండ్

మంగళగిరి (ప్రజా అమరావతి);

పీఎంఏవై లబ్ధిదారులకు వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ముప్పై మూడు నెలలు దాటినా ఇళ్ళను ను పూర్తిస్థాయిలో అప్పజెప్పక పోవడంపై మంగళగిరి పీఎంఏవై గృహాల సముదాయం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు

............


ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ...



పేదవాడి సొంత ఇంటి కల నిజం చేయాలనే ఆశయంతో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఆధునిక టెక్నాలజీతో, మంగళగిరి లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో 1728 ఇళ్లను నిర్మించారు


ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పీఎంఏవై గృహాల విషయంలో నాడు నానా రచ్చ చేసి, నేడు పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఆళ్ళ రామకృష్ణ రెడ్డీ


కేవలం మౌలిక సదుపాయాలు కల్పించి, లబ్ధిదారులకు అప్పజెప్పడం లో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది


ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతగానితనం వల్ల లబ్ధిదారులు ఇప్పటికే అద్దె రూపంలో రెండు లక్షలు, డీడీ రూపంలో చెల్లించిన డబ్బులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా బ్యాంకు లింకేజీ పేరుతో పిల్లను పూర్తిస్థాయిలో అప్ప చెప్పకుండానే  EMI లు కట్టించుకుంటూ లబ్ధిదారుల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం


తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందనే భయంతో లబ్ధిదారులకు ఇళ్ళు అప్పజెప్పడం లో నిర్లక్ష్యం వహిస్తున్న వైసీపీ ప్రభుత్వం


పి ఎం ఏ వై గృహాల పై అవినీతి ఆరోపణలు చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మీ ప్రభుత్వం ఏర్పడి 33 నెలల కాలం అయ్యింది అని గ్రహించాలి


ఎంతో దుర్లభమైన పరిస్థితిలో, గ్రహాల మధ్య గడ్డి పెరిగి పిచ్చి మొక్కల మధ్య  కావాలనే పాడుబెడుతున్నారు


పాదయాత్రలో ఉచితంగా ఇళ్లను ఇస్తానని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మడమ తిప్పిన జగన్ రెడ్డి


సదరు గృహ సముదాయం వద్ద ఒక పైలాన్ ను,ఒక బ్లాకు రంగును వేసుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అదే అభివృద్ధిగా భావించి జబ్బలు చరుచుకోవడం  సిగ్గుచేటు


కరోనా లాంటి కష్టకాలంలో ఈ గృహాలను ను అప్పజెప్పి ఉన్నట్లయితే, లబ్ధిదారులు ఆర్థికంగా కొంతవరకు నష్టపోకుండా ఉండేవారు


మూడు సంవత్సరాల్లో టిడిపి ప్రభుత్వం ఇళ్ళను పూర్తిచేసి ఇవ్వలేకపోయింది అని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నానా యాగీ చేసిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి, మీరు వచ్చి ముప్పై మూడు నెలల కాలం దాటిన మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు ఇవ్వకపోవడం మీ చేతకానితనానికి ఇది నిదర్శనం కాదా అని ప్రశ్నిస్తున్నాం


ఒక నెల రోజుల్లో సదుపాయాలను కల్పించి లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో గృహాలను అందజేయాలి, లేకుంటే మరింత తీవ్రంగా ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం


పీఎంఏవై గృహా సముదాయం వద్ద జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి, గుంటూరు పార్లమెంట్ టిడిపి ప్రధాన కార్యదర్శి  పోతినేని శ్రీనివాసరావు, పట్టణ పార్టీ అధ్యక్షులు దామర్ల రాజు, రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తోట పార్థసారథి, మంగళగిరి పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, రూరల్ మండల పార్టీ ఉపాధ్యక్షులు కొమ్మ సుకుమార్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్, రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, రాష్ట్ర తెలుగురైతు కార్యదర్శిగా గాదే పిచ్చి రెడ్డి, నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి,  నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు కారంపూడి అంకమ్మ రావు, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి ఇబ్రహీం, గుత్తికొండ ధనుంజయ రావు, మంగళగిరి పట్టణ తెలుగు యువత అధ్యక్షులు భోగి వినోద్, మంగళగిరి మండల తెలుగు యువత అధ్యక్షులు ఈపూరి జయకృష్ణ, మంగళగిరి పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సుభాని, పట్టణ ఎస్టీ సెల్ అధ్యక్షులు పేరం ఏడుకొండలు, మంగళగిరి రూరల్ మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు గడ్డిపాటి అపర్ణ, రూరల్ మండల టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు కాండ్రు రాజేష్, పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఊట్ల దుర్గా మల్లేశ్వరి, గుంటూరు పార్లమెంట్ తెలుగు యువత అధికార ప్రతినిధి కందుల నాగార్జున, నియోజకవర్గ తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఎలమంచిలి పద్మజ, మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి నన్నప నేని ఉదయ్, మండల తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి తోట సాంబయ్య, పట్టణ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పఠాన్ అబ్దుల్లా ఖాన్, మండల తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి అప్పల శాంతి,పట్టణ కమిటీ సభ్యులు భైరబోయిన శ్రీనివాసరావు నక్క రాజశేఖర్ , నల్గొండ పరమేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు గడదాసు రంగారావు, చింకా కోటేశ్వర రావు, నియోజకవర్గ తెలుగు యువత కమిటీ సభ్యులు దాసరి సునీల్, మండల తెలుగు రైతు కమిటీ సభ్యులు భీమవరపు శేషి రెడ్డి, పట్టణ మైనార్టీ సెల్ కమిటీ సభ్యులు షేక్ బాషా, షేక్ షమీరా, ఆకుల ఉమామహేశ్వర రావు, మన్యం రమేష్, వేమూరు మైనర్ బాబు,షేక్ హుస్సేన్, అబ్దుల్ మజీద్, తిరువీధుల బాపనయ్య, పెండ్ర పరమేష్, రుద్రు కోటేశ్వరరావు, ఉద్దంటి ఆంజనేయులు,నీలం అంకారావు,ఊట్ల కనకం,మేరుగ మేరీ, పూర్ణ, కొత్త శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

Comments