కొవ్వూరు గోష్పాద క్షేత్రం లో మహాశివరాత్రికి పటిష్ట మైన ఏర్పాట్లు చేయాలి....

 


కొవ్వూరు (ప్రజా అమరావతి);



కొవ్వూరు గోష్పాద క్షేత్రం లో మహాశివరాత్రికి  పటిష్ట మైన ఏర్పాట్లు చేయాలి.... 



కొవ్వూరు మునిసిపల్ ఛైర్పర్సన్ బావన రత్నకుమారి.


కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం లో మహాశివరాత్రి ఏర్పాట్ల పై బుధవారం సాయంత్రం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రత్న కుమారి మాట్లాడుతూ  మహా శివరాత్రికి అన్ని ప్రభుత్వ శాఖ ల అధికారులు సమన్వయం చేసుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యము లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నా రు. ఆలయ ప్రాంగణం లోను, స్నానాల రేవులలో సానిటేషన్ చేయాలని మునిసిపల్ అధికారులను ఆదేశించారు. మునిసి పాలిటీ అధికారులు లైటింగ్, త్రాగునీరు సదుపాయాలు, ఏర్పాటు భక్తులు రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు.



ఈ సందర్బంగా కొవ్వూరు ఆర్డీఓ ఎస్. మల్లిబాబు మాట్లాడుతూ,  గోష్పాద క్షేత్రం లో మహాశివరాత్రి కి తాత్కాలికస్నానా లు గదులు, బట్టలు మార్చుకునే గదులు,  మరుగుదొడ్లు ఏర్పాట్లు చేయాలన్నారు. పూజా సామాగ్రీ దుకాణాలు, ఇతర దుకాణాలు ముఖ ద్వారము వద్ద పెట్ట కుండా, భక్తులకు రాకపోకల కు ఇబ్బంది కలుగని ప్రదేశాల్లో ఏర్పాట్లు చేయాలన్నారు. క్షేత్ర పవిత్ర ను కాపాడుచు పరిసరాలను పరిశుభ్రం ఉంచే విధంగా చర్యలు తీసుకోవాన్నారు.  కోవిడ్ నిబంధన లు తప్పనిసరి గా పాటించాలన్నారు. ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా స్నాన ఘట్టాల్లో మత్స్య శాఖ అధికారులు 21 బోట్లు ఏర్పాట్లు చేసి గజ ఈత గాళ్ళను అందుబాటులో ఉంచాలని తెలిపారు. ప్రమాద హెచ్చరిక బోర్డులు, ఏర్పాటు చేయాలన్నారు. దీపారాధన కి ప్రత్యేక మయిన ప్రదేశాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. దాతలు ప్రసాద వితరణ కి ప్రత్యేకంగా ఒక ప్రదేశం ఏర్పాట్లు చేసి ఆ ప్రదేశం లోనే ఉండేటట్లు చూసుకోవాలన్నారు. బట్టలు మార్చు కొనే గదులు ఏర్పాట్లు చేసి, బోర్డులు ఏర్పాట్లు చేయాలన్నారు. బారి కేడ్ ఏర్పాట్లు చేయాలని, ప్రధమ చికిత్స కేంద్రంను ఏర్పాట్లు చేయాలన్నారు.శివరాత్రి ఏర్పాట్ల పై గోదావరి నది వడ్డున ఉన్న అన్ని దేవాలయ యాజమాన్యలతో సమావేశం నిర్వహించాలని మండల తాహిసీ ల్దార్ బి. నాగరాజు నాయక్ ను ఆదేశించారు.


 మహాశివరాత్రి ఏర్పాట్లు అధికారుల అందరూ చిత్తశుద్ధి తో విధులు నిర్వర్తించాలన్నారు.


ఈ కార్యక్రమం లో డి. ఎల్. పి. ఓ., భమిడి శివమూర్తి, మత్స్య శాఖ ఏ. డి. సైదా నాయక్, క్షేత్ర అర్చకులు, యం. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.




Comments