నేడు గృహనిర్మాణ శాఖామాత్యుల జిల్లా పర్యటన


నేడు గృహనిర్మాణ శాఖామాత్యుల జిల్లా పర్యటన

విజయనగరం ఫిబ్రవరి, 23 (ప్రజా అమరావతి):  రాష్ట్ర గృహనిర్మాణ శాఖామాత్యులు చెరుకువాడ శ్రీరంగనాధరాజు గురువారం జిల్లాలో పర్యటించనున్నారు.  24వ తేది ఉదయం 8.00 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి 9.00 గంటలకు విజయనగరం జిల్లా పరిషత్ అతిథి గృహానికి చేరుకుంటారు.  ఉదయం 9.15 గంటలకు అతిథి గృహం నుండి బయలుదేరి 9.30 గంటలకు గుంకలాం లేఅవుట్ ను పరిశీలిస్తారు.  10.30 గంటలకు గుంకలాంలో బయలుదేరి 12.00 గంటలకు సాలూరు మున్సిపాలిటీ గుమడాం లేఅవుట్ ను పరిశీలిస్తారు.  మధ్యాహ్నం 1.00 గంటకు గుమడాంలో బయలుదేరి 1.30 గంటలకు బొబ్బిలి మున్సిపాలిటీలో టిడ్కో వద్ద హౌసింగ్ లేఅవుట్ ను పరిశీలిస్తారు.  3.00 గంటలకు బొబ్బిలి నుండి బయలుదేరి 3.30 గంటలకు పార్వతీపురం మున్సిపాలిటీ నర్శిపురం లేఅవుట్ ను పరిశీలిస్తారు. అనంతరం మంత్రివర్యులు సాయంత్రం 4.30 గంటలకు నర్శిపురం నుండి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు.


Comments