అమరావతి (ప్రజా అమరావతి);
*రేపు (17.02.2022, గురువారం) విజయవాడలో సీఎం శ్రీ వైఎస్ జగన్, కేంద్రమంత్రి శ్రీ నితిన్ గడ్కరీ పర్యటన*
*రహదారులు, ఇతర ప్రాజెక్ట్‌ల ప్రారంభం, భూమి పూజ*
*విజయవాడ బెంజ్ సర్కిల్ పశ్చిమ ఫ్లై ఓవర్ ప్రారంభం*
రేపు విజయవాడలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్, కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీతో కలిసి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సీఎం శ్రీ వైఎస్ జగన్ మధ్యాహ్నం 12.05 గంటలకు ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం చేరుకుని, శ్రీ నితిన్ గడ్కరీతో కలిసి జాతీయ రహదారుల అభివృద్ది సంస్ధ నిర్మించిన 20 రహదారులు, ఇతర ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తారు. అంతేకాక 31 జాతీయ రహదారుల ప్రాజెక్ట్‌లకు భూమి పూజ చేసి, అక్కడి బహిరంగసభలో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.55 గంటలకు బెంజ్ సర్కిల్‌కు చేరుకుని కొత్తగా నిర్మించిన పశ్చిమ దిశ ఫ్లై ఓవర్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
addComments
Post a Comment