చెరువుల పునరుద్ధరణతో పల్లెల సమగ్ర అభివృద్ధి ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు.

 చెరువుల పునరుద్ధరణతో పల్లెల సమగ్ర అభివృద్ధి 

ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు. 


పారదర్శకంగా అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే అంబటి.

అంచులవారిపాలెంలో పనులను ప్రారంభించిన ఎంపి , ఎమ్మెల్యే. 


రాజుపాలెం (ప్రజా అమరావతి): 


చెరువుల పునరుద్ధరణ పల్లెల సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు.

 గురువారం మండలంలోని అంచులవారిపాలెం గ్రామం లో 12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు పూడిక తీత, కరకట్టల బలోపేతం వంటి అభివృద్ధి పనులను  ఆయన స్దానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో కలిసి ప్రారంభించారు. ఐటిసి ( బంగారు భవిష్యత్ )సంస్థ  నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఎంపి లావు మాట్లాడుతూ దశాబ్దాల క్రితం సామాజిక ఉమ్మడి ప్రయోజనాల కోసం నిర్మించిన ఈ చెరువులు  కూరుకుపోయారని వీటిలో పూడికను తొలగించి కరకట్టల బలోపేతంతో సామర్ధ్యం మెరుగుపడుతుందన్నారు. పూడిక తీసిన మట్టిని రైతులు ఉపయోగించుకుంటే సారవంతమైన భూములు, పంట దిగుబడులు మెరుగుపడతాయన్నారు. చెరువుల క్రింద మాగాణితో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు.  ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ చెరువుల అభివృద్ధి  రాజకీయ ప్రమేయము లేకుండా, అవినీతికి తావులేకుండా ఐటిసి సంస్థ ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. పూడిక తీయడం ద్వారా నీటి నిల్వ సామర్ధ్యం మెరుగుపతుందని, తద్వారా  గ్రామంలో భూగర్భ జలాల మట్టం కూడా పెరుగుతుందన్నారు. చేపలపెంపకం ద్వారా పంచాయితీకి ఆదాయం మెరుగుపడుతుందన్నారు. భూగర్భజాలలు పెరిగితే వేసవిలో నీటి ఎద్దడి తట్టుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. చెరువుల కింద మాగాణి సాగు పెరిగి, పశువులకు సైతం ఏడాది పొడవునా పశుగ్రాసం లభిస్తుందన్నారు.ప్రధానంగా పాడి- పంటకు చెరువుల కింద సాంస్కృతిక వికాసం, సాంప్రదాయాల వనరులు మెరుగు పడతాయన్నారు. ముందుగా అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఎంపిపి తేలుకుట్ల రాజేశ్వరరి, జడ్‌పిటిసి దొంతిరెడ్డి సునీతారెడ్డి, మండల కన్వీనర్‌ ఏపూరి శ్రీనివాసరావు, బాసులింగారెడ్డి, మర్రి సుబ్బారెడ్డి, ఐటీసీ జి ఎం వెంకరామిరెడ్డి,ఎం ఎస్ గౌరీ నాయుడు, సీనియర్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ బి. లక్ష్మీ నారాయణ, సర్పంచ్‌ అంచుల రామాంజనేయులు, ఎంపిడిఓ, తహశీల్దారు,  ఐపీసీ రీసోర్స్‌ పర్సన్‌ చెంబెటి  బొల్లయ్య ,స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.

Comments