కొవ్వూరు (ప్రజా అమరావతి);
విద్యార్థిని, విద్యార్థులు సైన్స్ అధ్యాయనం, ఆవిష్కరణలు పట్ల ఆశక్తి పెంచుకోవాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జె. సునీత పేర్కొన్నారు.
సోమవారం స్థానిక డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్సు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, సర్ సివి రామన్ భౌతిక శాస్త్రం లో చేసిన రామన్ ఎఫెక్ట్ కి నోబుల్ బహుమతి పొందినట్లు తెలిపారు. రామన్ ప్రభావం మూలాల, పరిశోధన లు పై విద్యార్థులకు వివరించారు. ప్రతి ఒక్క విద్యార్థి సైన్స్ పై ఆసక్తి పెంచుకుని సమాజానికి ఉపయోగపడేలా నూతన ఆవిష్కరణలు చెయ్యాల్సి ఉందన్నారు.
వైస్ ప్రిన్సిపాల్ వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, 1928 లో సర్ సివి రామన్ " రామన్ ఎఫెక్ట్ " ను ఫిబ్రవరి 28 న ఆవిష్కరించారని, అందుకే ప్రతి ఏడాది ఈరోజు ను జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నమని తెలిపారు.
జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని క్విజ్ పోటీలు నిర్వహించి, బహుమతి ప్రధానం చేశారు.
టి సాయిలక్ష్మి పర్యావరణం పై సైన్స్ ప్రభావం తయారు చేసిన ఆవిష్కరణ ను అధ్యాపకులు అభినందించారు.
ఈ కార్యక్రమానికి అధ్యాపకులు సాయి సుందర్, భూపతిరాయులు, సాదిక్, సూర్యనారాయణ, అధ్యాపకులు, అధ్యపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
addComments
Post a Comment