టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జట్టి విస్తృత తనిఖీలు
భక్తులకు, అధికారులకు పలు సూచనలు
తిరుమల, ఫిబ్రవరి 26 (ప్రజా అమరావతి): టిటిడి ముఖ్య నిఘా మరియు భద్రతా అధికారి శ్రీ గోపినాథ్ జట్టి శనివారం తిరుపతిలోని అలిపిరి, తిరుమలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. శ్రీవారి భక్తులకు పలు సూచనలు చేశారు. టిటిడి నిఘా మరియు భద్రతా అధికారులకు, ఇతర శాఖల అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు.
శ్రీవారి భక్తులకు సూచనలు
1. శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చే భక్తులు అందరూ తప్పనిసరిగా దర్శన టిక్కెట్లు కలిగివుండి అలిపిరి తనిఖీ కేంద్రం మరియు నడకదారి వద్ద నిఘా మరియు భద్రతా సిబ్బందికి చూపించి తిరుమలకు రావాలి.
2. శ్రీవారి భక్తులు అందరూ తప్పని సరిగా కోవిడ్ నియమ నిబంధనలు అనగా మాస్కు ధరించుట మొదలగునవి పాటించాలి.
3. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద నుండి ఉదయం 3 గంటలు నుండి రాత్రి 12 గంటల వరకు వాహనములు అనుమతించబడును.
4. ద్విచక్ర వాహనములను ఉదయం 4 గంటలు నుండి రాత్రి 10 గంటలు వరకు అనుమతించబడును. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పని సరిగా ధరించవలెను.
5.సిఫార్సు లేఖలు కలిగిన భక్తులు గురువారం, శుక్రవారం మరియు శనివారాల్లో తిరుమలకు అనుమతించబడరు.
6.తిరుమలలో ప్లాస్టిక్ వస్తువులు పూర్తిగా నిషేదించబడినవి. కనుక భక్తులు ఎవరూ తమ వెంట ప్లాస్టిక్ వస్తువులను తీసుకొని రాకూడదు.
7. తిరుమలలో నిషేధిత వస్తువులు అనగా మాంసం, మధ్యం, బీడీలు, సిగెరెట్లు తదితర పొగాకు సంబందిత వస్తువులు పూర్తిగా నిషేదించబడినవి. కనుక భక్తులు ఎవరూ తమ వెంట సదరు వస్తువులను తీసుకొని రాకూడదు.
8. తిరుమలకు వాహనముల రాక రద్దీ ఎక్కువగా వున్న దృష్ట్యా అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద సెక్యూరిటీ సిబ్బందికి సహకరించవలసిందిగా శ్రీ వారి భక్తులకు విజ్ఞప్తి.
9. ఘాట్ రోడ్ పైన ప్రయాణ సమయంలో అతివేగం ప్రమాదకరం. కావున భక్తులు అందరూ “నిదానమే ప్రదానము” అనే సామెతను అనుసరించి నిధానముగా తిరుమలకు చేరుకోవలెను.
10. శ్రీవారి భక్తులు అందరూ వారికి కేటాయించిన దర్శన తేదీలలో మాత్రమే తిరుమలకు రావలెను. ముందుగా వచ్చి ఇబ్బంది పడకూడదని విజ్ఞప్తి. అదే విధంగా వారికి కేటాయించిన సమయములలో మాత్రమే క్యూ లైను వద్దకు చేరుకోవలెను.
11. తిరుమలలో గదులు దొరకని శ్రీ వారి భక్తులు తిరుమలలోని 4 యాత్రికుల వసతి సముదాయములలో లాకర్ సదుపాయముతో వసతి పొందవచ్చు.
12. శ్రీ వారి భక్తులు వారివారి లగేజి, మొబైల్ ఫోన్ మరియు ఇతర విలువైన వస్తువులను వారివారి వసతి గదులలో జాగ్రత్తగా భద్రపరచి గాని డిపాజిట్ కేంద్రాలలో జమ చేసి గాని దర్శనమునకు రావలెను.
13. శ్రీవారి భక్తులు ఎవ్వరూ కూడా శ్రీవారి దర్శనమునకు గాని, వసతి గదులకు గాని ఎలాంటి దళారీల మాటలు నమ్మి వారికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని మనవి. అటువంటి దలరీలు ఎవరైనా తమ దృష్టికి వచ్చినచో వెంటనే తితిదే నిఘా మరియు భద్రతా అధికారులకు తెలియచేయవలెను.
అధికారులకు ఆదేశాలు
1. శ్రీవారి దర్శన టికెట్లు పెంచినందున మరియు తిరుమలకు వచ్చే శ్రీ వారి భక్తుల సంఖ్య పెరిగినందున తితిదే లోని అన్ని శాఖల అధికారులు అందరూ సమన్వయంతో తమతమ శాఖల పరిధులలో శ్రీవారి భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా ఏర్పాట్లు చేసి సేవలు అందించవలెను.
2. రిసెప్షన్ అధికారులు శ్రీ వారి భక్తులకు అందుబాటులో ఉన్నంత మేరకు వసతి గదులు గాని, యాత్రికుల వసతి సముదాయములలో కాని వసతి కల్పించవలెను.
3. వివిద రకాల దర్శన టికెట్లు కల్గిన శ్రీ వారి భక్తులకు వారివారి దర్శన ప్రవేశ మార్గాలను సూచించే సూచిక బోర్డు లను ఏర్పాటు చేసి భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైనులలో ప్రవేశించే విధంగా తితిదే అధికారులు చర్యలు తీసుకోవలెను.
4. క్యూ లైనులలో పోతున్న భక్తులకు పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ ద్వారా అధికారులు మార్గ నిర్దేశము చేయాలి.
5. క్యూ లైనులలో అందుబాటులో వున్న మరుగుదొడ్లను శుభ్రముగా ఉంచి భక్తులకు ఎలాంటి అసౌకర్యము లేకుండా చూడాలి.
6. క్యూ లైనులలో పోతున్న భక్తులకు తాగునీటి సౌకర్యము కల్పించాలి.
7. క్యూ లైనుల ద్వారా శ్రీవారి ఆలయము లోనికి ప్రవేశించిన భక్తులకు శ్రీవారి ఆలయములో నిరంతరం గోవింద నామాలు గాని గోవింద నామ జపం గాని వినిపించే విధంగా రేడియో మరియు
బ్రాడ్ కాస్టింగ్ అధికారులు ఏర్పాట్లు చేయాలి.
8. శ్రీవారి భక్తులు శ్రీవారి దర్శనానికి ప్రవేశించినది మొదలు దర్శన అనంతరం ఆలయము వెలుపలికి వచ్చే వరకు వారితో గౌరవ మర్యాదలతో మెలగవలెను.
9. శ్రీవారి భక్తులు శ్రీవారి ఆలయము నాలుగు మాడ వీధులలో చెప్పులు ధరించి తిరుగరాదు. మాడ వీధులలో బయట ఏర్పాటు చేసిన చెప్పులు స్టాండులను వినియోగించుకోవలెను. అందులకు గాను సరిపడునన్ని చెప్పుల స్టాండులను అధికారులు ఏర్పాటు చేయాలి.
10. తితిదే నిఘా మరియు భద్రతా అధికారులు స్థానిక సివిల్ పోలీసు అధికారులతో కలిసి సమన్వయంతో తిరుమలలో ఎలాంటి శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకోవలెను.
11. తితిదే నిఘా మరియు భద్రతా అధికారులు స్థానిక ట్రాఫిక్ పోలీసు వారితో కలిసి సమన్వయంతో తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ మరియు పార్కింగులను శ్రీవారి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలి.
12. తితిదే నిఘా మరియు భద్రతా అధికారులు స్థానిక నేర నియంత్రణ పోలీసు అధికారులతో కలిసి సమన్వయంతో తిరుమలలో ఎలాంటి దొంగతనాలు, దోపిడీలు మొదలైనవి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
13. శ్రీవారి భక్తులు శ్రీవారి దర్శనానికి అలిపిరి తనిఖీ కేంద్రం నుండి తిరుమలకు బయలు దేరినప్పటినుండి దర్శన అనంతరం తిరిగి తిరుమల నుండి తిరుపతికి చేరే వరకు ఎలాంటి అసౌకర్యాలు గాని ఇబ్బందులు గాని లేకుండా తృప్తిగా వారివారి గమ్య స్థానాలకు చేరుకునేందుకు అధికారులు అందరూ సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవాలి.
addComments
Post a Comment