మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు బహుళజాతి సంస్థలలో ఉద్యోగాలు

తాడేపల్లి (ప్రజా అమరావతి);      కెఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు బహుళజాతి సంస్థలలో ఉద్యోగాలు


లభించాయని విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ సారధి వర్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బహుళజాతి సంస్థలైన ఏడోబ్ షికోడ్స్, అమెజాన్, ఎనలాగ్ డివైజెస్, ఒరాకిల్, క్రెడెల్ పాయింట్ మొదలయిన సంస్థలలో విద్యార్థులు ఎంపికయ్యారని అన్నారు. విద్యార్థులకు 44లక్షల ప్యాకేజీ నుంచి 30 లక్షల ప్యాకేజీ శాలరీ తో ఉద్యోగం సంపాదించారని పేర్కొన్నారు. తమ విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరం నుంచే విద్యార్థులకు కోడింగ్, ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు విశ్వవిద్యాలయం అందిస్తుందని చెప్పారు. విద్యార్థులను అన్ని రంగాలలో రాణించేందుకు ప్రతి ఒక అధ్యాపకులు కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. ఉద్యోగం లభించిన విద్యార్థినీ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్లేస్‌మెంట్స్ డీన్ డాక్టర్ ఎన్.బి.వి ప్రసాద్, ప్లేస్‌మెంట్స్ డైరెక్టర్ శర్వణన్, సీఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ హరికిరణ్ వేగే, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ సుమన్, అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Comments