స్వామి, అమ్మ వార్ల కు పట్టు వస్త్రాలు సమ ర్పించే అవకాశం కల్పించిన భగ వంతునికి,సి ఎం కు ధన్య వాదాలు.



 శ్రీ కాళహస్తి బ్రహ్మోత్సవాల ను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను  సమర్పించిన గౌ. రాష్ట్రపంచాయతీరాజ్ గ్రామీణాభి వృద్ధి శాఖ మాత్యులు.



స్వామి, అమ్మ వార్ల కు పట్టు వస్త్రాలు సమ ర్పించే అవకాశం కల్పించిన భగ వంతునికి,సి ఎం కు  ధన్య వాదాలు. 



గౌ.రాష్ట్ర ముఖ్య మంత్రి  కి స్వామి, అమ్మ వార్ల ఆశీ స్సులు ఎల్ల వేళలా ఉండాలని కోరు కున్నా:గౌ.రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి. 


 శ్రీకాళహస్తి,ఫిబ్రవరి 28 (ప్రజా అమరావతి);  


 గౌ.రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారికి   స్వామి,అమ్మ వార్ల ఆశీస్సులు ఎల్ల వేళలా ఉండాలని కోరు కున్నానని గౌ.రాష్ట్ర పంచా యతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు...


 మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి అమ్మవార్లకు సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు..


 పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఆలయ ప్రాంగణంలోకి చేరుకున్న* *మంత్రివర్యుల కు మంగళ వాయిద్యాలతో నడుమ శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు  మధుసూదన్ రెడ్డి, శ్రీకాళహస్తి ఆలయ ఈవో పెద్దిరాజు,ఆలయ అధికారులు స్వాగతం పలికారు..


 తొలుత  మణికంఠేశ్వర స్వామి ఆలయము నకు  చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి అనంతరం   పట్టు వస్త్రాలను తల మేస్తూ  తీసుకొని ప్రధాన గణపతి, చెంగల్వ రాయ స్వామి వారికి పూజలు నిర్వహించి అనంతరం ప్రధాన ఆలయం లోని అలంకార మండపం నకు  చేరుకొని స్వామి అమ్మ వార్ల కు పట్టు వస్త్రాలు సమర్పించారు...


 అనంతరం శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారిని, జ్ఞానప్రసూనాంబ అమ్మ వారిని  దర్శించుకున్నారు..


 తదుపరి దక్షిణామూర్తి ని దర్శించుకున్న అనంతరం వేద పండితుల ఆశీ ర్వాదంతో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు...* 



 అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ రెండో ఏడాది వరుసగా స్వామి,అమ్మ వార్ల కు  రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం తన అదృష్టమని ఈ అవకాశాన్ని కల్పించిన* *భగవంతునికి,గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు..* *రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారికి,ఈ ప్రభుత్వం నకు స్వామి, అమ్మవార్ల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించానన్నారు ప్రజలకు ఆమోద యోగ్యమైన పరిపాలనను ముఖ్యమంత్రి అందిస్తున్నారని, వారికి రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి అవసరమైన బలాన్ని స్వామివారి చేకూర్చాలని వేడుకున్నట్లు తెలిపారు.. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేందుకు గౌ. రాష్ట్ర ముఖ్య మంత్రి కి స్వామి వారి ఆశీర్వాదం ఉంటుందని అన్నారు..



 ఆలయం వెలుపల భూకైలాసం సెట్ ను ప్రారంభించిన మంత్రి తదుపరి రూ.7 కోట్ల అంచనా వ్యమం తో చేపట్టనున్న స్వర్ణముఖి నది ఆనకట్ట  సుందరీ కరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు...


 ఈ కార్యక్రమంలో  మంత్రి వెంట టిటిడి పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ కె.జె. శాంతి,మాజీ శాసనసభ్యులు ఎస్.వి.నాయుడు సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు



Comments