విజయవాడ (ప్రజా అమరావతి);
విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకుల వారి కార్యాలయం నందు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఒక ఆఫీస్ సబ్ ఆర్డినేట్ పోస్ట్
కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ సంచాలకులు శ్రీ బి. రవి ప్రకాష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేసారు.
దరఖాస్తు చేయు అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణులై సైకిల్ నడుపుట వచ్చి ఉండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండవలెను. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తించునని తెలిపారు.
అర్హత కలిగిన వారు తమ బయో డేటా వివరములు, విద్యార్హతలు, ప్రభుత్వ కార్యాలయములో పనిచేసిన అనుభవ పత్రాలు మొదలుగునవి జతపరిచి ది. 18-02-2022 తేదీ లోపు ఈ క్రింది తెలిపిన చిరునామాకు పంపవలెనని ఆ ప్రకటనలో శ్రీ బి. రవి ప్రకాష్ రెడ్డి తెలిపారు.
అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు పంపవలసిన చిరునామా: సంచాలకుల వారి కార్యాలయం, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, డోర్ నెం. 74-14-2, రాజా నరేంద్ర బిల్డింగ్ మొదటి అంతస్తు, యనమలకుదురు రోడ్, కృష్ణ నగర్, విజయవాడ - 520007.
addComments
Post a Comment