ఉక్రెయిన్ నుండి రాష్ట్రానికి చెందిన వారికి సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు

 ఉక్రెయిన్ నుండి రాష్ట్రానికి చెందిన వారికి సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు


సచివాలయంలో 1902 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

0863-2340678తో హెల్ప్ లైన్ కేంద్రం,+91-8500027678 వాట్సప్ గ్రూప్ 

సుమారు 300 మంది వరకూ వాట్సప్ గ్రూప్ లో విద్యార్ధులు రిజిష్టర్ అయ్యారు

ఉక్రెయిన్ లో ఉన్నవారు ఎక్కడివారు అక్కడే ఉండాలి సరహద్దులకు రావద్దు

ప్రభుత్వ ఖర్చుతో స్వస్థలాలకు చేర్చేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు

రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్సు కమిటీ అధ్యక్షులు యం.టి.కృష్ణబాబు

అమరావతి,26 ఫిబ్రవరి (ప్రజా అమరావతి):ఉక్రెయిన్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రానికి చెందిన వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉక్రెయన్ సంక్షోభంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్సు కమిటీ అధ్యక్షులు యం.టి కృష్ణబాబు పేర్కొన్నారు.ఈమేరకు శనివారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన వారిని సురక్షితంగా తీసుకువచ్చే విషయమై ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి విదేశాంగ మంత్రివర్యులకు లేఖ వ్రాశారన్నారు.ఉక్రెయిన్ సంక్షోభంపై అమరావతి సచివాలయం మొదటి బ్లాకు ఆర్టీజిఎస్ లో తన నేతృత్వంలో రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్సు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు.ఈకమిటీలో సభ్య కన్వీనర్ గా ప్రత్యేక అధికారి (అంతర్జాతీయ సహకారం)గితేశ్ శర్మ,ఎపి డైరీ డెవలప్మెంట్ ఎండి డా.ఎ.బాబు, ఢిల్లీలోని ఎపి భవన్ అదనపు రెసిడెంట్ కమీషనర్ హిమాన్షు కౌశిక్,రాష్ట్ర రైతు బజారుల సిఇఓ బి.శ్రీనివాస రావు,ఎపి ఎన్ఆర్టి సొసైటీ సిఇఓ కె.దినేష్ కుమార్,అందరు జిల్లా కలక్టర్లు సభ్యులుగా ఉన్నారని తెలిపారు.ఈకమిటీ ఆధ్వర్యంలో 1902 నంబరుతో కంట్రోల్ రూమ్,0863-2340678 ల్యాండ్ లైన్ నంబరుతో హెల్ప్ లైన్ కేంద్రం నిరంతరం పనిచేస్తుందని ఆయన వివరించారు.అలాగే +91-8500027678 తో వాట్సప్ గ్రూప్ కూడా ఉందని కృష్ణబాబు తెలిపారు.

ప్రస్తుతం ఉక్రెయిన్‌లో ఉన్న కొంత మంది విద్యార్థులతో రాష్ట్ర స్థాయి హెల్ప్ లైన్‌ కేంద్రం ద్వారా నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని కృష్ణబాబు తెలిపారు.ఎటియంలలో డబ్బులు లేవనో లేక ఆహారం,తాగునీరు వంటి నిత్యావసరాల కొరతనే విద్యార్ధులు కొంత ఆందోళన చెందే వీలుందని అఁదకు మించి పెద్దగా ఆందోళనకర పరిస్థితులు ఉండవని అనుకుంటున్నట్టు మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.ఉక్రెయిన్‌లో ఉన్న ప్రస్తుత పరిస్థితి గురించి ఆరాతీసి వారి వివరాలను సేకరించడం కోసం విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను కూడా పంపగా ఇప్పటి వరకూ 360 మంది వరకూ విద్యార్థుల డేటా రిజిష్టర్ అయ్యారని కృష్ణబాబు వివరించారు.రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ మరియు ఢిల్లీ లోను ఎపిభవన్ అధికారులు ఎప్పటికప్పుడు విదేశాంగశాఖ అధికారులతోను ఉక్రెయన్ ఎంబసీతోను మాట్లాడుతూ మాట్లాడడం జరుగుతోందని ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు మీడియాకు వివరించారు.కమాండ్ కంట్రోల్ రూమ్‌ ద్వారా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి వారికి ఉక్రెయిన్ సరిహద్దు దేశాల్లోగల మన విదేశాంగశాఖ ఇన్‌చార్జిలు ఫోన్ నంబర్లు,అన్నిసలహాలు ఈగ్రూప్ ద్వారా పోస్ట్ చేయడం జరుగుతోందని తెలిపారు.

బుకారెస్ట్ నుండి ఢిల్లీ,ముంబాయిలకు చేరుకోనున్నరెండు విమానాలు-ఉచిత రవాణా.

ఉక్రెయిన్ లో ఉన్నవారిని ఉచితంగా విమానాల ద్వారా మనదేశానికి తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని టాస్ పోర్సు కమిటీ అధ్యక్షులు కృష్ణబాబు చెప్పారు.ఆవిధంగా వచ్చిన వారిలో మన రాష్ట్రానికి చెందిన వారిని ఉచితంగా విమానాల ద్వారా రాష్ట్రానికి తీసుకురావాలని ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.బుకారెస్టు నుండి 27వతేదీ ఆదివారం ఉ.2.30గం.లకు ఢిల్లీకి ఒక విమానం చేరుకోనుండగా దానిలో తెలుగు విద్యార్ధులు 13 మంది ఉన్నారని,అలాగే ముంబైకి మరో విమానం 26వతేదీ శనివారం రాత్రి రానుండగా దానిలో 9మంది తెలుగు విద్యార్ధులు ఉన్నారని చెప్పారు.

ఈమీడియా సమావేశంలో రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్సు కమిటీ సభ్య కన్వీనర్  ప్రత్యేక అధికారి (అంతర్జాతీయ సహకారం)గితేశ్ శర్మ,ఎపి డైరీ డెవలప్మెంట్ ఎండి డా.ఎ.బాబు,రాష్ట్ర రైతు బజారుల సిఇఓ బి.శ్రీనివాస రావు,ఎపి ఎన్ఆర్టి సొసైటీ సిఇఓ కె.దినేష్ కుమార్ పాల్గొన్నారు.


Comments