కాపుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీ కంటే ఎక్కువ వెచ్చించాం.

 కాపుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీ కంటే ఎక్కువ వెచ్చించాం.



 *త్వరలోనే రాయదుర్గం, కల్యాణ దుర్గం నియోజకవర్గాల్లో కాపు భవన్ ల పూర్తి* 


 *కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి* 


అనంతపురము, ఫిబ్రవరి 16 (ప్రజా అమరావతి);


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండున్నరేళ్ల కాలంలో కాపుల సంక్షేమం కోసం హామీ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు చేసిందని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శ్రీనివాస్ పేర్కొన్నారు. కాపులకు ఏటా రూ.2000 కోట్లు ఖర్చు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగిందని.. కేవలం కాపు నేస్తం ద్వారానే పథకం కోసమే రూ.1500 కోట్లు నేరుగా కాపు మహిళల ఖాతాల్లో వేయడం జరిగిందని, ఇతర సంక్షేమ పథకాల ద్వారా మరో రూ.6027 కోట్లు కాపులకు అందించామన్నారు. రెండున్నరేళ్ల కాలంలో సంక్షోభాలు తలెత్తినా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సంక్షేమంలో చెప్పిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే చెలిందన్నారు. ఐదు మంత్రి పదవులతో పాటూ ఇతర పదవులు ఎన్నో కాపులకు ఇచ్చి సామాజిక న్యాయం పాటించారన్నారు.


కాపు భవన్ ల నిర్మాణాలు, కాపు సంక్షేమ పథకాల అమలుపై పర్యవేక్షణ నిమిత్తం కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి ఈరోజు రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజక వర్గాల్లో పర్యటించారు. పర్యటన అనంతరం బుధవారం సాయంత్రం సమయంలో అనంతపురము ఆర్.అండ్.బీ గెస్ట్ హౌసులో మీడియా సమావేశం నిర్వహించారు. 


సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజక వర్గాల్లో ఇచ్చిన హామీ మేరకు కాపు భవన్ ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. దాదాపు 80 శాతం నిర్మాణం పూర్తి చేసుకున్న నిర్మాణాలను త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలో సైతం కాపు భవన్ నిర్మాణానికి రూ.2 కోట్లు ఇప్పటికే విడుదల చేశామని,

త్వరలోనే సాంకేతిక ఇబ్బందులను తొలగించి నిర్మాణాలను ప్రారంభిస్తామన్నారు. 


అదే సమయంలో కాపుల్లో ఎన్ని వర్గాలున్నా, సంఘాలున్నా అవన్నీ ఒక్కతాటి మీదకు వచ్చి కాపుల సంక్షేమం కోసం పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 


ఈ కార్యక్రమంలో ఆహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, ఏపీ టిడ్కో డైరెక్టర్ బి. రాఘవరావు, జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ నాగముని తదితరులు పాల్గొన్నారు. 


Comments