విద్యార్ధినుల పట్ల టీచర్ల అసభ్య ప్రవర్తన
ఇద్దరు టీచర్లపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు
విజయనగరం, ఫిబ్రవరి 17 (ప్రజా అమరావతి) :
జిల్లాలోని గుమ్మ లక్ష్మీపురం మండలం బాలేశు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్ధినులపై అసభ్య ప్రవర్తనకు సంబంధించిన అంశాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కఠిన చర్యలు చేపడుతోంది. ఈ మేరకు యీ వ్యవహారంతో సంబంధం వున్న ఇద్దరు ఉపాధ్యాయులను ఇప్పటికే జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేయడంతోపాటు వారిపై కేసు నమోదుకు కూడా ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మూడు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోక్సో చట్టం సెక్షన్ 10తో పాటు, మహిళల పట్ల అసభ్య ప్రవర్తనకు గాను సి.ఆర్.పి.సి. సెక్షన్ 354, ఎస్.సి., ఎస్.టి. అత్యాచార చట్టాల కింద వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రదానోపాధ్యాయుడు స్వామినాయుడు, ఉపాధ్యాయుడు సూర్యనారాయణలను పోలీసులు కస్టడీలోకి తీసుకొని వారిని విచారిస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలను సహించేది లేదని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి పేర్కొన్నారు.
addComments
Post a Comment