ప్రభుత్వానికి మరింత అప్రతిష్ట తప్పదు: కాకినాడ పౌర సంక్షేమ సంఘం.

 కాకినాడ భూదాన యజ్ఞం బోర్డు భూములు రాబందుల (అవినీతికార్పొరేటర్లు) పాలవుతున్న తీరు తగదు!! ప్రభుత్వానికి మరింత అప్రతిష్ట తప్పదు: కాకినాడ పౌర సంక్షేమ సంఘం.


కాకినాడ (ప్రజా అమరావతి);

కాకినాడ నగరంలో ప్రభుత్వ ఐ టి ఐ వెనుక వున్న భూదాన యజ్ఞ బోర్డు భూములను బినామీ గా స్వంతం చేసుకునే దురాక్రమణకు కాకినాడ అవినీతి కార్పొరేటర్లు పాల్పడటం పేదలకు దక్కాల్సిన పట్టాలను రాబందులు తన్నుకు పోతున్న తీరుగా వుందని కాకినాడ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి నుండి కార్పొరేటర్లు దగ్గరుండి ప్రోక్లైనర్లతో చదును చేసి దోచుకుంటున్న దుర్మార్గాన్ని తప్పు బట్టారు. 2014ముందు భూదాన యజ్ఞ బోర్డు ద్వారా 269మంది లబ్దిదారులు పట్టా అనుమతులు పొందగా రెవిన్యూ విభాగం ఇవ్వాల్సిన డి పట్టా పంపిణీని జాప్యం చేయడం రాష్ట్ర విడిపోవడం భూదాన యజ్ఞ బోర్డు సభ్యులు విభజిత రాష్ట్రాల్లో లేకపోవడం వలన రాబందుల దృష్టి వీటిపై పడిందన్నారు. గడచిన మేయర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి కార్పోరేటర్ నుండి లక్షా పదివేలు వసూలు చేసి గజం లక్ష రూపా యలు రేటు పలుకు తున్న  ఐ టి ఐ వెనుక భూములు వంద గజాల వంతున దురాక్రమణ చేసే సాహసం జరిగింద న్నారు. ఈ విషయమై కలెక్టర్ హరికిరణ్ కు బాధితులు పౌర సంఘం ఆధ్వర్యాన ధర్నా వినతి ఇవ్వగా దర్యాప్తు చేస్తా మని తెలిపారన్నారు. కౌన్సిల్ గడువు ముగుస్తున్నందున బరి తెగించిన రీతిగా భూదాన యజ్ఞ బోర్డు భూములు స్వంతం చేసుకోవడం కోసం పబ్లిక్ గా భూముల్లోకి చొరబడి కమ్యూనిటీ హాలు నిర్మాణంగా వంకపెట్టి మీది అయితే మీది.. మాది అయితే మాది అంటూ చేస్తున్న దురాక్రమణ కు జిల్లా అధికారులు ఇచ్చిన అనుమతులు ఏమిటని రమణరాజు ప్రశ్నించా రు.  గాంధీజీ ప్రియశి ష్యుడు భారతరత్న వినోబాభావే ఆశయాల ప్రకారం భూదాన యజ్ఞ బోర్డు నిబంధనల ప్రకారం ఆ భూములు  పేదలకు మాత్రమే పట్టాలుగా దక్కాలని రాబందుల చేజిక్కే వెసులుబాటు ఇవ్వడం తగదని స్టే వున్న భూములపై అడ్డగోలుగా జరుగుతున్న ఆక్రమణ తీరు న్యాయస్థానం ఆగ్రహానికి గురవుతుం దన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు స్పందించి ప్రజలఆస్తులు పరిరక్షించుకోవడానికి తగిన రీతిలో ప్రతి ఒక్కరూ స్పందించాలని కోరారు.


Comments