పోలవరం /ఏలూరు (ప్రజా అమరావతి) ;
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్చి 4 వ తేదీ పర్యటన వివరాలు
తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు , పునరావాస ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటుగా భారత ప్రభుత్వం - కేంద్ర జల శక్తి మిషన్ శాఖా మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షేకావత్. పర్యటించనున్నారు.
కేంద్ర మంత్రి 3 వ తేదీ న్యూఢిల్లీ నుంచి సా.5.45 కి బయలుదేరి రా.8 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రికి విజయవాడ చేరుకుని బస చేస్తారు.
మార్చి 4 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో కలిసి కేంద్ర మంత్రి షేకావత్ పోలవరం ప్రాజెక్టు ప్రాంతాల్లో పర్యటిస్తారు.
అందులో భాగంగా ఉ.9 గంటలకు తాడేపల్లి నుంచి హేలికాప్టర్ లో తూర్పుగోదావరి జిల్లా గోకరవరం మండలం , ఇందుకూరుపేట ఉ.10 గంటలకు చేరుకుని ఉ.10.05 కి రోడ్డు మార్గాన్న ఇందుకూరుపేట-1 లోని ఆర్ అండ్ ఆర్ కాలనీ కి చేరుకుంటారు. ఉ.10.10 నుంచి ఉ.10.40 వరకు ఆర్ అండ్ ఆర్ కాలనీలో నిర్వాసితుల తో ముఖాముఖి లో పాల్గొంటారు.
అక్కడి నుంచి ఉ.10.40 కి బయలుదేరి
ఉ.10.50 కి హెలికాప్టర్ ద్వారా ఉ. 10.20 కి పశ్చిమగోదావరి జిల్లా తాడువాయి లోని ఆర్ అండ్ ఆర్ కాలనీకి చేరుకుంటారు.
ఉ.11.20 నుంచి మ.12.00 వరకు ఆర్ అండ్ ఆర్ కాలనీలో నిర్వాసితుల తో ముఖాముఖి లో పాల్గొంటారు. మ.12 కి బయలుదేరి మ్612.05 హెలిప్యాడ్ కి చేరుకుని మ.12.10 గంటలకు బయలుదేరి మ. 12.30 కి పోలవరం డ్యామ్ సైట్ కి చేరుకుంటారు. మ 12.30 నుంచి మ.1.45 వరకు స్పిల్ వే, యూ/ఎస్ కాఫర్ డ్యామ్, ఈ సి ఆర్ ఎఫ్ డ్యామ్, డి/ఎస్ కాఫర్ డ్యామ్, రేడియల్ క్రెస్ట్ గేట్స్ ప్రాంతాల్లో పోలవరం ప్రాజెక్టు ప్రాంతాల్లో పర్యటిస్తారు. మ.1.45 నుంచి మ.2.45 భోజన విరామం తరువాత సమావేశ మందిరంలో మ.2.45 నుంచి మ.3.45 వరకు అధికారులు, తదితరులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పర్యటన ముగిసిన అనంతరం సా.4.25 కి హెలిప్యాడ్ ప్రాంతానికి చేరుకుని హెలికాప్టర్ ద్వారా సా.4.30 కి బయలుదేరి సా.5.15 తాడేపల్లి లోని ముఖ్యమంత్రి నివాసంలో ని హెలిప్యాడ్ కి చేరుకుంటారు.
తదుపరి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ అక్కడ నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి బెంగుళూరు కి వెళతారు.
addComments
Post a Comment