మాయ మాటలతో నిరుద్యోగులను మోసం చేయలేవు

 *మరుగుదొడ్లు వద్ద కూర్చుని డబ్బులు వసూలు చేయడానికి, మూటలు మోయడానికి నిరుద్యోగులు ఎవరూ సిద్ధంగా లేరని ఈ మోసపు ముఖ్యమంత్రి గమనించాలి*


*2.35 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ జగన్ రెడ్డి ?*

*జాబ్ క్యాలెండర్ ఎప్పుడిస్తావు?*


 *మాయ మాటలతో నిరుద్యోగులను మోసం చేయలేవు


*  

*అరెస్టులతో ఉద్యమాన్ని అడ్డుకోలేరు*

 

- గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు

గుంటూరు (ప్రజా అమరావతి);

తాము అధికారంలోకి వస్తే ఏడాదికో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు 2.35 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని, వెంటనే ఆ హామీని నిలబెట్టుకోవాలని గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.


 మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో విజయవాడ ధర్నా చౌక్ వద్ద విద్యార్థి సంఘాలు తలపెట్టిన ధర్నా కు వెళుతున్న విద్యార్థి, యువజన సంఘాల నాయకులను అరెస్ట్ చేసి మంగళగిరి పట్టణం పోలీస్ స్టేషన్ కు తరలించిన వారిని పరామర్శించి, సంఘీభావం తెలిపిన టిడిపి నాయకుల బృందం 


మూడేళ్లుగా ఒక్క ప్రభుత్వ ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా, మాయ మాటలతో నిరుద్యోగులను ఇంకెంత కాలం మోసగిస్తారని ప్రశ్నించారు.


 ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారని, ఇప్పుడు ఖాళీ పోస్టులు భర్తీ చేయమని అడిగితే పోలీసులతో అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు.


 నిన్నటి బడ్జెట్ సమావేశంలో పోస్టుల భర్తీ గురించి కనీసం ప్రస్తావించకపోవడం యువత పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్య వైఖరిని తెలుపుతుందన్నారు.


జాబ్ క్యాలెండర్ తో పాటు 2.35 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, 6500 పోలీసు ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలన్నారు.


 అప్పటివరకు నిరుద్యోగులకు నెలకు 5 వేల రూపాయల చొప్పున భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.


మరుగుదొడ్లు వద్ద కూర్చుని డబ్బులు వసూలు చేయడానికి, మూటలు మోయడానికి నిరుద్యోగులు ఎవరూ సిద్ధంగా లేరని ఈ మోసపు ముఖ్యమంత్రి గమనించాలి


పోలీసులతో ఉద్యమాలను అడ్డుకోలేరని హెచ్చరించారు.


 జగన్ రెడ్డీ పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు


మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద విద్యార్థి, యువజన సంఘాలను కలిసి సంఘీభావం తెలిపిన వారిలో మంగళగిరి పట్టణ పార్టీ అధ్యక్షులు దామర్ల రాజు, తాడేపల్లి మండల పార్టీ అధ్యక్షులు అమరా సుబ్బారావు, పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, దొప్పల పూడి జ్యోతిబసు, పఠాన్ జానీ ఖాన్,సింహాద్రి రామారావు తదితరులు ఉన్నారు

Comments