లక్ష్యాలను చేరక పోవడానికి స్పష్ట మైన వివరణ ఇవ్వాల్సి ఉందని ..ఇకపై భాద్యత రహితంగా సమాధానం ఇస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు.

 


కొవ్వూరు (ప్రజా అమరావతి);


లక్ష్యాలను చేరక పోవడానికి  స్పష్ట మైన వివరణ ఇవ్వాల్సి ఉందని ..ఇకపై భాద్యత రహితంగా సమాధానం ఇస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు.డివిజన్ స్థాయి సమీక్షా సమావేశం తీసుకున్న నిర్ణయాలు ప్రతిదీ మినిట్స్ గా నమోదు చేసి తదుపరి సమావేశం నాటికి పరిష్కరించాల్సి ఉందని జిల్లా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు. జిల్లా స్థాయి అధికారులు పనుల పురోగతిపై వారం వారం క్షేత్రస్థాయి అధికారులతో పనుల పురోగతి పై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించాలన్నారు.


సోమవారం కొవ్వూరు డివిజన్ స్థాయి సమావేశం లో మధ్యాహ్నం సమావేశంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలైన హౌసింగ్, పీఆర్, ఉపాధి హామీ, ఆరోగ్యం, పురపాలక, విద్య, డిఆర్డీఏ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ, ఇకపై ప్రతి నెల డివిజన్ స్థాయి సమావేశం నిర్వహిస్తామని, ఉదయం 10 గంటలకు రెవెన్యూ అంశాలు, మధ్యాన్నం  2.30 నుంచి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పై సమీక్ష చేస్తామన్నారు.  టంఛన్ గా సమావేశాలు నిర్వహిస్తామని, గత సమావేశ పెండింగ్ అంశాల పురోగతి పై సమీక్ష చేస్తామన్నారు.  లబ్ధిదారులు ఇళ్ళనిర్మాణం చేసేలా మండల స్థాయిలో చర్యలు తీసుకోవాలని, ఇళ్ళు కట్టుకోవడానికి ఆసక్తి చూపని లబ్దిదారులకి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.  గ్రౌండెడ్, నాన్ గ్రౌండెడ్ , లే అవుట్ అంశాల వారీగా ఇబ్బందులు తెలుసుకోవలన్నారు. డ్వాక్రా మహిళలకు ఇళ్ల గ్రౌండింగ్ కోసం రుణ సదుపాయం కల్పింస్తున్నందున అదిశలో చైతన్యం తీసుకుని రావాల్సి ఉందన్నారు. ఇళ్ళ నిర్మాణం కోసం  లబ్దిదారుని కోరిన మీదట స్థలం కేటాయించినందున త్వరితగతిన ఇంటి నిర్మాణం ప్రారంభింపచెయ్యలని స్పష్టం గా తెలియచెయ్యాల్సి ఉందన్నారు. ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి పేర్కొన్న ప్రాధాన్యత అంశాలపై మరింతగా దృష్టి సారించి లక్ష్యాలకు 100 శాతం సాధించాల్సి ఉందన్నారు. డివిజన్ లోని  క్షేత్ర స్థాయి అధికారులతో ప్రతి నెలా సమీక్ష లో ప్రత్యక్షంగా సమీక్ష చెయ్యగలమన్నారు. క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పనులను ఎంపీడీఓ లు, ఏపిఓ లు పర్యవేక్షణ చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేస్తా, లోపాలు ఉంటే చర్యలు తీసుకోవడానికి వెనుకడానని కలెక్టర్ హెచ్చరించారు. 


స్వచ్చ సంకల్ప పధకానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. వర్మీ కంపోస్టు , చెత్త సేకరణ లో 10 పంచాయతీల్లో పొడి చెత్త సేకరణ ప్లాంట్ ఏర్పాటు  చేసి ఆదాయ వనరులు కోసం మోడల్ గా తీర్చి దిద్దెందుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. డిపిఓ 24 గంటల్లో నివేదిక తో సమరించాలని ఆదేశించారు.జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) హిమాన్షు శుక్లా ఉపాధి హామీ పై సమీక్షిస్తూ, మండలవారిగా అందుబాటులో ఉన్న పనులు, వాటి ద్వారా ఎంత మందికి ఉపాధి హామీ కల్పించగలరో ప్రశ్నించారు. మీమీ మండలాలకు నిర్దేశించిన లక్ష్యాలను సాదించగలిగితే అందుకు సంబంధించిన మెటీరియల్ కాంపోనెంట్ ని సమకూర్చగలుగుతామన్నారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 7 గంటల లోపు క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పర్యవేక్షణ పూర్తి చేయాలన్నారు. ప్రతి ఎంపీడీఓ లు కనీసం 20 వేల పనిదినాలు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. తీర్మానాలు పేరుతో పని దినాలు కల్పన ప్రతిపాదనల్లో జాప్యం ఉపేక్షించబోమని తెలిపారు. కొత్త సాఫ్ట్వేర్ లో క్షేత్ర స్థాయి లో ఫీల్డ్ అసిస్టెంట్ లు జియో ట్యాగింగ్ చెయ్యడం ద్వారా డేటా అప్లోడ్ సులభం అవ్వుతుందన్నారు. అనంతరం జల జీవన్ మిషన్ పై సమీక్షిస్తూ 28 వేల ఇంటింటి కనెక్షన్స్ పెండింగులో ఉన్నాయన్నారు. కాంట్రాక్టర్ తో మాట్లాడి తక్షణమే కనెక్షన్స్ ఇప్పించేలా చర్యలు చేపట్టి, అనంతరం ఎఫ్ బి ఓ లు రూపొంచాలని తెలిపారు. కమ్యూనిటీ టాయిలెట్స్, ఎస్ డబ్ల్యు పిసి (స్వచ్ఛ సంకల్ప) వర్మీ కంపోస్టు, చెత్త సేకరణ పై సమీక్షించారు.


హౌసింగ్ జేసి సూరజ్ గనోరే ప్రతి లబ్దిదారుడు ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి వారం హౌసింగ్ లబ్దిదారులతో సమావేశం నిర్వహించి, ఇళ్ళు నిర్మించేలా అవగాహన పెంచాలన్నారు.  


సంపూర్ణ పౌష్టికాహారం, జగనన్న విద్యా దీవెన లబ్దిదారుల వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. బ్యాంకు లకి వ్యక్తిగతంగా వెళ్లి ఎస్ హెచ్ జి  రుణాలు గ్రౌండింగ్ లక్ష్యాలను మార్చి 20 నాటికి పూర్తి చేయాలని జేసి (సంక్షేమం)  పి. పద్మావతి పేర్కొన్నారూ. మునిసిపల్ అధికారి కనీస పరిజ్ఞానం ఉండాలన్నారు.ఈ సమావేశంలో  జాయింట్ కలెక్టర్ లు హిమాన్షు శుక్లా, సూరజ్ గనేరో, పి. పద్మావతి, ఆర్డీవో ఎస్. మల్లిబాబు, జిల్లా అధికారులు, డివిజన్, ఎంపిడిఓ లి, మునిసిపల్ కమిషనర్ లు, ఎపిఓ లు,  మండల సంక్షేమ శాఖ అధికారులు హౌసింగ్, పాల్గొన్నారు.
Comments