విద్యాభివృద్ధికి నావంతు పూర్తి సహకారం ఉంటుంది

 *విద్యాభివృద్ధికి నావంతు పూర్తి సహకారం ఉంటుంది*


*-మెరిట్‌ విద్యార్థినులకు మా సంస్థలో విద్యారాయితీలు  కల్పిస్తాం*

*-ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం*

*-విద్యార్థులకు ప్రభుత్వ విద్యాపథకాలు అండగా నిలుస్తున్నాయి*

 *-నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు*

*-దుర్గిలో అట్టహాసంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నూతన బిల్డింగ్‌ ప్రారంభం*

విద్యాభివృద్ధికి తనవంతు పూర్తి సహకారం అందిస్తానని, పల్నాడులోని అన్ని ప్రభుత్వ విద్యాలయాల్లో మెరుగైన మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. దుర్గిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు సంబంధించిన నూతన బిల్డింగ్‌ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా ఎంపీ, ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణరెడ్డి,  వైసీపీ యువజన ప్ర«ధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. నాయకులు గ్రామంలో  ఈ సందర్భంగా ర్యాలీ ఏర్పాటు చేశారు. నూతన బిల్డింగ్‌ను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రసంగించారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ముఖ్యంగా మహిళలు ప్రభుత్వం అందింస్తున్న  పథకాలను వినియోగించుకుని ఉన్నత చదువులు చదవాలని, సమాజంలో స్వయం ఉపాధితో ఎదగాలని ఆకాంక్షించారు.  తల్లిదండ్రులు పిల్లల చదువును ప్రోత్సహించాలని కోరారు.

ఇంటర్మీడియట్‌లో 70శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అగ్రికల్చర్‌ బీఎస్‌సీ గ్రూప్‌లో 50శాతం ఫీజు రాయితీ అందిస్తామని సభాముఖంగా పేర్కొన్నారు.

Comments