ఆకాశంలో సగం… అవకాశాల్లో సగం.. అన్నింటా సగం..

 కె.ఎల్.విశ్వవిద్యాలయంలో  అల్యూమిని అసోసియేషన్,ఉమెన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం వేడుకలకు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా

 తాడేపల్లి (ప్రజా అమరావతి);      ఏపీ టూరిజం అసిస్టెంట్ డైరెక్టర్ లాజ్వాన్తీ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,ఆకాశంలో సగం… అవకాశాల్లో సగం.. అన్నింటా సగం..


అంటూ ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకల సంబరాలు అంగరంగ వైభంగా జరుపుకుంటున్నామని తెలిపారు.విధిరాతను ఎదిరించి ఆత్మగౌరవానికి ప్రతీక నిలుస్తూ.. ఎందరో నారీమణులు చరిత్రలో తమకంటూ ఓ స్థానాన్ని సాధించుకున్నారని స్పష్టం చేశారు. ‘మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదని పేర్కొన్నారు.అన్ని రంగాలలో ఉన్నతి స్థితికి ఎదిగినప్పటికీ నిర్భయ సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.నేటికి బాలికలు, స్త్రీలు , వృద్ధులన్న తేడా లేకుండా జరుగుతున్న అత్యాచారాలను చూస్తుంటే సమాజంలోని వికృత సంఘటనలు ఏ రీతిలో ఉన్నాయో అర్థమవుతోందని పేర్కొన్నారు. మహిళలపై సైబర్ నేరాలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయని  వెల్లడించారు.నేడు వివిధ రంగాలలో మహిళలు చైతన్యంతో కదం తొక్కుతున్నారని పేర్కొన్నారు.దేశంలో వివిధ రంగాల్లో మహిళలు ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్నారని తెలిపారు. రెండు దశాబ్దాలుగా చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ మారిందని అన్నారు.ఎవరో వస్తారని .. ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తమ భుజస్కందాలపై భారాలు మోస్తూ , కుటుంబానికి అసరాగా నిలుస్తూ సమస్యల చట్రం నుంచి అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.అవకాశమిస్తే మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా పోటీ పడగలరని అన్నారు.దేశాభివృద్ధిలో స్త్రీ సమానమైన పాత్ర ఉందని ప్రపంచానికి తెలియజేసే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం భావించవచ్చని చెప్పారు.దశాబ్దాలుగా సాగిన మహిళా ఉద్యమాల ఫలితంగా సాధించిన సమాన హక్కులను పరిరక్షించుకోవలసిన బాధ్యతను మహిళా దినోత్సవం గుర్తు చేస్తుందన్నారు .ఈ సంతోషకరమైన క్షణాలను సాటి మహిళలతో పంచుకోవడం తనకు ఆనందాన్నిస్తోందని వారు. పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో

ఈ కార్యక్రమంలో విర్చ్యువల్ విధానంలో విశ్వవిద్యాలయ కార్యదర్శి కోనేరు కాంచన లత, ప్రో ఛాన్సలర్ జగన్మోహన్ రావు,

రిజిస్ట్రార్ డాక్టర్ వై.వి.ఎస్.ఎస్.ఎస్.వి.ప్రసాదరావు,విద్యార్థి విభాగ సంక్షేమ అధిపతి డీన్ హనుమంతరావు, హ్యూమనిటీస్ డీన్ డాక్టర్ కిషోర్ బాబు,డీన్ కె.ఆర్.ఎస్.ప్రసాద్, ఉమెన్స్ ఫోరం కన్వీనర్ లలిత, వాసుజ, కావ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments