అన్నీ దానాల్లో అన్నదానానికి ప్రత్యేక స్థానం ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ్ రాజు పేర్కొన్నారు.

 


నిడదవోలు (ప్రజా అమరావతి); 


అన్నీ దానాల్లో అన్నదానానికి ప్రత్యేక స్థానం ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ్ రాజు పేర్కొన్నారు.ఆదివారం స్థానిక  శ్రీ ఉమా కాటకూటేశ్వర లింగేశ్వర  స్వామి ఆలయ  59 వ వార్షికోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాథ్ రాజు మాట్లాడుతూ, ప్రతి ఏటా ఈ శివాలయంలో జరిగే వార్షికోత్సవాల్లో స్వంత ఖర్చులతో అన్నదానం నిర్వహించడం జరుగుతోందన్నారు. 59 వ వార్షికోత్సవం సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా తన వంతుగా ఈరోజు సుమారు 9 వేల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ తనకు తోచిన రీతిలో సమాజ సేవ కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు. అనంతరం ప్రత్యేక పుజా కార్యక్రమంలో  పాల్గొన్నారు. రాష్ట్రంలో ని ప్రజలు సుఖః సంతోషాలతో , ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్దించినట్లు తెలిపారు.


ఈ అన్నదాన కార్యక్రమం లో ఆలయ ట్రస్ట్ ఛైర్మన్, సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.