తాడేపల్లి (ప్రజా అమరావతి); ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనల నుంచి వచ్చిన గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కి బాటలు
వేస్తోందని, విద్య, వైద్య రంగాలకు సమున్నత స్థాన౦ ఇస్తూ భవిష్యత్ తరాలకు రాచబాటలు వేస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ అన్నారు. మహారాష్ట్ర పూనా జిల్లా పరిషత్ నుంచి 8 మంది సభ్యుల గల బృందం రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా బుధవారం సిఆర్.డి కార్యాలయంలో కమిషనర్ ని కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ వారితో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, నూతన సచివాలయ వ్యవస్థ తదితర అంశాలపై మాట్లాడారు. రెండవ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించి డిజిటల్ పంచాయతీలు, కోర్ డ్యాష్ బోర్డు, ఆర్.టి.జి.ఎస్, నాడు- నేడు, విద్య సంక్షేమ రంగాల మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆరోగ్య శ్రీ, రైతు భరోసా పథకం తదితర అంశాలపై అధ్యయనం చేయనున్నారు. పూనా జిల్లా పరిషత్ డిప్యూటీ సిఇఓ మిలింద్ తోనాపే నేతృత్వంలో ఈ బృందం రాష్ట్రంలో పర్యటించనుంది.
గ్రామ,వార్డ్ సచివాలయాల్లో నియమించిన 17 శాఖలకు చెందిన ఉద్యోగుల ద్వారా దాదాపు 252 సేవలను ప్రజల ఇంటి వద్దకే అందిస్తున్నామని, లక్షా 40వేల ప్రభుత్వ ఉద్యోగులు, రెండు లక్షల 65వేల మంది వాలెంటీర్లు ఈ సేవలను అందిస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ సచివాలయాలు, 3842 వార్డు సచివాలయాలు పని చేస్తున్నాయని వారికి కమిషనర్ చెప్పారు. అదే విధంగా నాడు- నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఈ పనులు జరిగాయని అంటూ ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్ సిలబస్, మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తూనే ఇంగ్లీష్ మీడియంలో విద్య బోదనకు పెద్దపీట వేస్తున్నామని పిల్లలకు ఉచితంగా యూనిఫారం, బ్యాగులు, బూట్లు, మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం అందిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల చేరిక సంఖ్య గణనీయంగా పెరిగిందని, పిల్లల అందరికి విద్య- అందరికి ఆరోగ్యం అన్నది రాష్ట్ర ప్రభుత్వ నినాదంగా మారిందని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా పునాది వేస్తున్నామని, భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ హ్యుమాన్ రిసోర్స్ హబ్ గా మారనుందని ఆయన చెప్పారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి హయంలో ప్రారంభమైన పథకాల అన్నింటిని ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారని వారికి వివరించారు. కార్పోరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చి దిద్దుతున్నామని, మీ పర్యటనలో సచివాలయాలు,రైతు భరోసా, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, పారిశుద్ధ్య కార్యక్రమల్లో భాగంగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సోక్ పిట్స్, సాలిడ్ వెల్త్ ప్రోసెసింగ్ సెంటర్స్ ను సందర్శించాలని కోరుతూ మహారాష్ట్ర కూడా అభివృద్ధిలో ముందుందని నీటి సంరక్షణ, పంచాయతీరాజ్ వ్యవస్థ అమలు పటిష్టంగా ఉన్నాయని ఒకరి నుంచి ఒకరు విషయాలను తెలుసుకుని, నేర్చుకుందామని కమిషనర్ కోన శశిధర్ సూచించారు.
ఈ కార్యక్రమ౦లో ఇజిఎస్ సంచాలకులు పి. చినతాతయ్య, జాయింట్ కమిషనర్ ఎం.శివప్రసాద్,పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో గ్రామ & వార్డు సచివాలయాలు, జల జీవన్ మిషన్, డిజిటల్ పంచాయత్స్, ఎంజిఎన్ఆర్ఇజిఎస్, జగనన్న పల్లె వెలుగు, క్లాప్ వంటి అంశాలపై సంబంధిత అధికారులు పిపిటి ద్వారా వివరించారు.
addComments
Post a Comment