అలిపిరి శ్రీ వెంకటే శ్వర సప్త గో ప్రదక్షి ణ మందిరం ను దర్శించు కున్న గౌ. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి...

 అలిపిరి శ్రీ వెంకటే శ్వర సప్త గో ప్రదక్షి ణ మందిరం ను దర్శించు కున్న గౌ. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి... 


తిరుపతి,మార్చి 5 (ప్రజా అమరావతి): తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలిపిరి వద్ద గల శ్రీ వెంకటేశ్వర సప్త గో  ప్రదక్షణ మందిరం ను గౌ.భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ నూతలపాటి వెంకటరమణ దంపతులు శనివారం సాయంత్రం దర్శించుకున్నారు...



గౌ. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరుమల పర్యటనలో భాగంగా

శ్రీ వెంకటేశ్వర సప్త గో ప్రదక్షణ మందిరం ను దర్శించగా...సప్త గో ప్రదక్షిణ మందిర  విశిష్టత ను  టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి,ఆలయ అర్చకులు  వివరిం చారు...


అనంతరం గౌ. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులు వారి కుటుంబ సభ్యులు గో ప్రదక్షిణ చేసి వేణుగోపాల స్వామి వారిని దర్శించు కున్నారు... 


తదుపరి గో తులా భారం వద్దకు చేరు కొని గోమాత కు సరిపడా తులాభారం  తో మొక్కులు చెల్లించుకున్నారు...


 గౌ. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెంట    

 గౌ. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్  లు రాజేష్ కుమార్ గోయల్, ప్రశాంత్ కుమార్ సూర్యదేవర,గౌ. హైకోర్టు జడ్జి యు. దుర్గాప్రసాద్, రిజిస్ట్రార్ డి. వెంకటరమణ, ఎ.వి రవీంద్రబాబు, జిల్లా జడ్జి వై.వి.ఎస్.బి.జి. పార్థసారథి,గౌ. మూడవ అదనపు జిల్లా జడ్జి  వీర్రాజు, గౌ. ప్రోటోకాల్ మెజి స్ట్రేట్ కోటేశ్వర రావు,టీటీడీ జేఈవో వి. వీర బ్రహ్మం, 

కోర్టు ప్రోటోకాల్ సూపరిండెంట్ ధనుంజయ నాయుడు సంబంధిత అధికారులు కలరు..


గో ప్రదర్శన శాల సందర్శన అనంతరం

తిరుమలకు బయలుదేరి వెళ్లిన గౌరవ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుటుంబం


Comments